మరో సూపర్ స్టార్ ఇంటికి బాంబ్ బెదిరింపు

Update: 2020-07-05 11:27 GMT
తమిళ సినిమా పరిశ్రమ చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి. ఆ కారణంగా సినిమాలతోనే కాకుండా ఇతర విషయాలతో కూడా కోలీవుడ్ సినీ ప్రముఖులు వార్తల్లో ఉంటారు. కొన్ని రోజుల క్రితం సూపర్ రజిని కాంత్ ఇంట్లో బాంబ్ పెట్టాము అంటూ కొందరు దుండగులు పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో హడావుడి చేయడం జరిగింది. ఇప్పుడు అదే తరహాలో మరో సూపర్ స్టార్ విజయ్ ఇంటికి కూడా బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది.

అర్ధరాత్రి సమయంలో సూపర్ స్టార్ విజయ్ ఇంట్లో బాంబు ఉంది అంటూ పోలీసులకు అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి చెప్పాడట. దాంతో పదుల సంఖ్యలో చెన్నై పోలీసులు విజయ్ ఇంటికి చేరుకున్నారు. అర్ధరాత్రి సమయంలో విజయ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా నిద్ర లేపి సోదాలు నిర్వహించారు.

ఇల్లంతా చూసిన తర్వాత చివరకు ఏమి లేదని పోలీసుకు ఒక నిర్దారకు వచ్చిన తర్వాత అక్కడ నుండి వెళ్లిపోయారట. కాల్ ఎక్కడి నుండి వచ్చింది.. ఎవరు చేశారు అనే విషయాన్ని పోలీసులు విచారణ జరుపుతున్నారట.
Tags:    

Similar News