ఈమద్య కాలంలో తమిళ స్టార్ హీరోలకు బాంబు బెదిరింపు కాల్స్ చాలా కామన్ అయ్యాయి. కొన్నాళ్ల క్రితం రజినీకాంత్.. విజయ్.. మణిరత్నం.. అజిత్ ల ఇళ్లలో బాంబులు పెట్టినట్లుగా ఆకతాయిలు కాల్స్ చేశారు. బెదిరింపు కాల్స్ ను లైట్ తీసుకోకుండా ఆ సమయంలో క్షుణ్ణంగా పోలీసులు వారి వారి ఇళ్లను సోదించారు. ఎక్కడ కూడా బాంబు ఆనవాళ్ల లభించలేదు. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య ఆఫీస్ లో కూడా బాంబు పెట్టినట్లుగా పోలీసులకు కాల్ వచ్చింది. వెంటనే పోలీసులు హుటా హుటిన సూర్య ఆఫీస్ కు చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ సోదాలు చేశారు. అంతా భావించినట్లుగానే అది కూడా ఫేక్ కాల్ అంటూ తేలిపోయింది.
దాదాపు గంటన్నర రెండు గంటల పాటు పోలీసులు బాంబ్ స్వ్కాడ్ సోదాలు చేసిన తర్వాత ఏమీ లేదని నిర్థారణకు వచ్చి ఊపిరి పీల్చుకున్నారు. గుర్తు తెలియని నెంబర్ నుండి కాల్ రావడంతో పోలీసులు వారిని గుర్తించేందుకు కష్టంగా మారింది. ఆకతాయిలు చేస్తున్న ఈ పనితో చాలా మంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కనుక ఖచ్చితంగా త్వరలోనే బాంబు బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని పట్టుకుంటామంటూ పోలీసులు ప్రకటించారు. సెల్రబెటీల ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో లైట్ తీసుకోలేక పోతున్నారు. హడావుడిగా వెళ్తే అక్కడ ఏం ఉండటం లేదు. పోలీసులతో ఆడుకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ జనాలు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు.