నెలరోజుల నిరీక్షణ తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఆర్యన్ ను ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కింది కోర్టులన్నీ కూడా ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేయలేదు. నెలరోజులుగా బెయిల్ కోసం అటు షారుఖ్ ఖాన్, లాయర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్సీబీ ఏవేవో కారణాలు చెప్పి బెయిల్ ను అడ్డుకుంటోంది.
గురువారం విచారణ అనంతరం బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్ తోపాటు అర్బాజ్ మర్చంట్, మూన్ మూన్ ధమేచాలకు బెయిల్ మంజూరు చేసింది.దీంతో దాదాపు 20 రోజులకు పైగా జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది.
ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై బాంబే హైకోర్టులో మూడు రోజుల నుంచి సుధీర్ఘ వాదనలు కొనసాగాయి. ఆర్యన్ ఖాన్ తరుఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. పలు కీలక అంశాలను ప్రస్తావించి బెయిల్ వచ్చేలా చేశారు.కుట్రపూరితంగానే ఆర్యన్ ను ఎన్.సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారన్నారు. ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని.. డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవని కోర్టుకు తెలిపారు. మరి అలాంటప్పుడు ఆర్యన్ ఏ విధంగా సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారని తెలిపారు. తనతోపాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్ దొరికితే ఆర్యన్ ను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.
20 రోజులకు పైగా ఎలా జైలులో ఉంచుతారని ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అతడి వయసు తక్కువ అని.. దాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును కోరారు.
ఎన్సీబీ తరుఫున గురువారం ఏఎస్.జీ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. ఆర్యన్ డ్రగ్స్ వాడుతుంటాడని.. ఇది తొలిసారి కాదని వాదించారు. డ్రగ్స్ విక్రేతలను చాలా సార్లు సంప్రదించాడని.. డ్రగ్స్ విక్రయించే ప్రయత్నంలోనూ ఉన్నట్టు తేలిందన్నారు. వాదనలు విన్న బాంబే హైకోర్టు ఆర్యన్ తోపాటు సహా నిందితులుగా ఉన్న ఆర్భాజ్, మూన్ మూన్ లకు బెయిల్ మంజూరు చేసింది.
కేసులో పూర్తి స్థాయి కోర్టు ఆర్డర్ రేపు వెలువడే అవకాశం ఉంది. ఆర్యన్ ఖాన్ జైలు నుంచి రేపు లేదా ఎల్లుండి విడుదలై బయటకు వచ్చే అవకాశం ఉందని లాయర్లు తెలిపారు.