వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కు వివాదాలు కొత్తేమీ కాదు. ఏదో ఒక విషయంలో ఆయన పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా 'తడ్కా' సినిమాకు సంబంధించిన వివాదంలో అయన పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వివాదం పూర్వాపరాలేంటో ఒకసారి చూద్దాం.
ప్రకాష్ రాజ్ 'తడ్కా' అనే బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మలయాళం చిత్రం 'సాల్ట్ అండ్ పెప్పర్' కు రీమేక్. ఈ సినిమాను జీ గ్రూప్ వారి ఎస్సెల్ విజన్ తో కలిసి సంయుక్తంగా ప్రకాష్ నిర్మించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం బడ్జెట్ లో కొంత భాగం రూ.4.25 కోట్ల ను ఎస్సెల్ గ్రూప్ వారు చెల్లించారట. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం తను ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వడం లేదట. డ్యూస్ అంతా కలిపి అది రూ. 5.88 కోట్లకు చేరింది. దీంతో ఎస్సెల్ గ్రూప్ వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారు ప్రకాష్ రాజ్ ను ఆ పెండింగ్ అమౌంట్ చెల్లించాల్సిందిగా ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఆదేశించారు. దీంతో ప్రకాష్ రాజ్ కోర్టు వారికి జూలై 2019 కల్లా మొత్తం డబ్బు ఎస్సెల్ వారికి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. అయినా ప్రకాష్ ఇప్పటివరకూ డబ్బు చెల్లించలేదట.
ఈ పెండింగ్ అమౌంట్ లో భాగంగా రెండు కోట్ల రూపాయల చెక్ ను ఎస్సెల్ వారికి ప్రకాష్ రాజ్ ఇచ్చారట. ఈ కేసుపై తాజాగా స్పందించిన బాంబే హైకోర్టు జడ్జి కేఆర్ శ్రీరామ్ "ఒకవేళ రూ. 2 కోట్ల చెక్ కనుక బౌన్స్ అయిన పక్షంలో ప్రకాష్ రాజ్ చర్యను కోర్టు ధిక్కారం కింద పరిగణిస్తామని" తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నెక్స్ట్ హియరింగ్ ఆగష్టు 30 న జరగనుంది. మరోవైపు ఎస్సెల్ వారు తమకు రావాల్సిన మొత్తం డబ్బును ప్రకాష్ రాజ్ చెల్లించేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ గడువు ఇచ్చారట. మరి ప్రకాష్ రాజ్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకుంటాడో వేచి చూడాలి.