గత రెండు మూడు దశాబ్దాల్లో వచ్చిన తెలుగు సినిమాల్లో బెస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ల లిస్టు తీస్తే అందులో టాప్‌లో ఉండే పాత్రల్లో 'బొమ్మరిల్లు'లోని హాసిని ఒకటి. ఆ పాత్ర అపట్లో ఒక సెన్సేషన్. ఇప్పటి ప్రేక్షకులు చూసినా ఆ పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. ఈ పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది ముంబయి భామ జెనీలియా. 'బొమ్మరిల్లు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన జెన్నీకి ఆ తర్వాత తెలుగులో చాలా అవకాశాలే వచ్చాయి. ఐతే ఇంత మంచి పాత్రను తాను చేయనంటూ షూటింగ్ మొదలయ్యాక సినిమాను వదులుకోవడానికి రెడీ అయిందట జెన్నీ. ఐతే అప్పటికే జెనీలియాతో 'హ్యాపి'లో నటించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఆమెను ఒప్పించి ఈ సినిమాలో కొనసాగేలా చేశాడట. 'బొమ్మరిల్లు' కథను భాస్కర్ బన్నీకి సైతం వినిపించాడు. అతను ఈ సినిమా సెట్స్‌కు కూడా వచ్చి కొన్ని రోజులు షూటింగ్ చూశాడట.
ఐతే 'బొమ్మరిల్లు' మొదలైన తొలి రోజుల్లో.. అందులో హీరో హీరోయిన్లు అర్ధరాత్రి బయటికి వచ్చి ఐస్ క్రీమ్ తినే సన్నివేశాలు చిత్రీకరించారట. ఐతే రెండే డైలాగులున్న ఈ సన్నివేశాన్ని రాత్రి 9 గంటలకు మొదలుపెడితే తెల్లవారుజాము వరకు కూడా చిత్రీకరణ సాగిందట. ఏకంగా 35 టేక్స్ చేశారట ఈ సన్నివేశం కోసం. దీంతో జెనీలియా విసుగెత్తిపోయి దర్శకుడు భాస్కర్ మీద నమ్మకం కోల్పోయిందట. చిన్న సన్నివేశం కోసం ఒక ఫుల్ నైట్ టైం పట్టడంతో తాను ఈ సినిమా చేయలేనంటూ కోపంగా ఆమె సెట్స్ నుంచి వెళ్లిపోయిందట. ఐతే ఆ రోజు షూటింగ్‌కు బన్నీ కూడా వచ్చాడని.. అతను జెన్నీ దగ్గరికి వెళ్లి నచ్చజెప్పాడని భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ''భాస్కర్ చాలా మంచి దర్శకుడు, ఒక్క సీన్ చూసి అతడిని అంచనా వేయకు. ఈ సినిమా కచ్చితంగా నీ కెరీర్‌ను మలుపుతిప్పుతుంది. దీన్ని వదులుకోకు'' అని బన్నీ.. జెన్నీకి నచ్చజెప్పి ఆమె ఈ సినిమాలో కొనసాగేలా చేశాడట. ఆ రోజు జెన్నీ కనుక మనసు మార్చుకోకపోయి ఉంటే ఆమె కెరీర్లో ఒక గొప్ప పాత్ర మిస్సయిపోయేదే.