బొమ్మరిల్లు.. అంత సులువుగా మరిచిపోదగ్గ సినిమా కాదు. చిన్నా పెద్దా.. మాస్ క్లాస్.. ఇలా తేడాలేమీ లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఉర్రూతలూగించిన సినిమా. 21వ శతాబ్దంలో వచ్చిన బెస్ట్ తెలుగు సినిమాల్లో ముందు వరుసలో ‘బొమ్మరిల్లు’ను చెప్పుకోవాలి. తెలుగు సినిమాలు చూడ్డం మానేసిన కొందరు పాతతరం ప్రేక్షకులు.. ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసి మురిసిపోయిన పరిస్థితి అప్పట్లో. దీన్ని మించిన భారీ హిట్లు చాలా ఉన్నాయి కానీ.. ఇలా అందరి ఆమోదం పొందిన సినిమాలు చాలా చాలా అరుదు. ఇలాంటి సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేయడం కంటే ఆనందం ఇంకేముంటుంది? భాస్కర్ ఆ ఆనందంలో ఎంతగా ఉబ్బి తబ్బిబ్బయిపోయాడో అప్పట్లో? ‘బొమ్మరిల్లు’ అనే తన తొలి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చేసుకుని తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసిన భాస్కర్ ను చూసి.. టాలీవుడ్ కు గొప్ప దర్శకుడు దొరికాడని అనుకున్నారంతా. ఐతే పదేళ్ల తిరిగేసరికి ఆ భాస్కర్ అడ్రస్ లేడు. భాస్కర్ ఏమీ వన్ ఫిల్మ్ వండర్ కాదు. తన తర్వాతి సినిమాల్లోనూ ప్రతిభ చూపించాడు. కానీ ఒక సినిమా ఫలితం అతడి రాతను మార్చేసింది. ఇండస్ట్రీ నుంచే అంతర్ధానం అయిపోయే పరిస్థితి తెచ్చిపెట్టింది. అదే.. ఆరెంజ్.
‘పరుగు’ సినిమాతో రెండో ప్రయత్నంలోనూ మంచి ఫలితాన్నే అందుకున్న భాస్కర్.. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో ‘ఆరెంజ్’ సినిమా చేసే ఛాన్స్ దక్కినందుకు ఎంత సంతోషించాడో. కానీ ఆ అవకాశమే అతడి రాతను మార్చేసింది. ‘ఆరెంజ్’ విమర్శల ప్రశంసలందుకున్నా.. కమర్షియల్ గా దారుణమైన ఫలితాన్నందుకుని.. భాస్కర్ కు చాలా చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. ఆ దెబ్బతో మళ్లీ అతడికి ఛాన్సివ్వడానికే నిర్మాతలు ముందుకు రాని పరిస్థితి. కొంత విరామం తర్వాత భాస్కర్ కు అవకాశమిచ్చే సాహసం బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ చేశాడు కానీ.. తన శైలికి భిన్నంగా ‘ఒంగోలుగిత్త’ లాంటి రెగ్యులర్ మాస్ సినిమాతో తనను అప్పటిదాకా అభిమానిస్తున్న ప్రేక్షకులకూ దూరమైపోయాడు భాస్కర్. తర్వాత తమిళంలో ‘బెంగళూరు డేస్’ రీమేక్ ఛాన్స్ వచ్చింది. అది పెద్ద డిజాస్టర్. కట్ చేస్తే.. ఇప్పుడు ఎక్కడా అవకాశాలు లేక ఖాళీ అయిపోయాడు భాస్కర్. ‘బొమ్మరిల్లు’ చూసి భాస్కర్ గురించి ఏదో అనుకుంటే.. పదేళ్ల తర్వాత ఇంకేదో అయింది. దర్శకుడిగా అతడు కట్టుకున్న ‘బొమ్మరిల్లు’ చాలా వేగంగా కుప్పకూలిపోయింది.