సోషల్ మీడియా పరాకాష్టలో మంచి కంటే చెడు ప్రచారమే అధికమవుతోంది. తప్పుడు ప్రచారం.. వెర్రి కూతలు ఈ వేదికపై ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో తెలిసిందే. నిప్పు లేనిదే పొగ రాదన్న మాట వాస్తవమే కానీ ఎలాంటి నిజాలు లేకుండా సృష్టించడం పనిగా పెట్టుకుంటున్నారు కొందరు. ఇది ప్రొఫెషనల్ జర్నలిజం విలువను దించేస్తోందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. కొందరు ర్యాంకింగుల కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుండడంపై సెలబ్రిటీ ప్రపంచం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
తాజాగా అలాంటి సైట్ల పై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిప్పులు చెరిగారు. తన నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా.. మేమే రిలీజ్ చేశాం అంటూ తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని బాలీవుడ్ వెబ్ మీడియాపై బోనీ నిప్పులు చెరిగారు. దశాబ్ధాల పాటు పలువరు స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్లను నిర్మించిన బోనీ కపూర్ ఇలా ఆవేదన వ్యక్తం చేయడం ప్రముఖంగా చర్చకు వచ్చింది.
ప్రస్తుతం ఆయన ఖాకీ దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు క్యాస్టింగ్ ఎంపిక జరుగుతోందని తమ నిర్మాణ సంస్థ నుంచి ప్రకటన వచ్చినట్లు బాలీవుడ్ యూ ట్యూబ్.. వెబ్ మీడియాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీంతో బోనీ ఆఫీస్ ముందు ఔత్సాహికులు అంతా క్యూ కట్టారుట. తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి ఎలాంటి క్యాస్టింగ్ ఎంపిక జరగలేదని ఆఫీస్ స్టాప్ బదులిచ్చిందిట. దీంతో అవకాశం కోసం వెళ్లిన వారంతా నిరుత్సాహంతో వెనుదిరిగారు. ఆ విషయం బోనీ కపూర్ కు సిబ్బంది వివరించడంతో వెంటనే ఆయన ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై నిప్పులు చెరిగారు.
ఆ అవాస్తవ ప్రకటనని షేర్ చేసిన నెటిజనులను బోనీ వదిలి పెట్టలేదు. పనీ పాటా లేకపోతే పక్క వారి వ్యాపారాల్లోకి తొంగి చూడడమేనా మీ వృత్తి? అంటూ బోనీ చాలా సీరియస్ గానే ప్రశ్నించారు. బోనీ ఇలా సోషల్ మీడియాపై ఫైర్ అవ్వడం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన సీరియస్ అయిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా దుబాయ్ లో శ్రీదేవి ఆకస్మిక మరణం తర్వాత తనపై జరిగిన దుష్ప్రచారానికి ఆయన చాలా సీరియస్ అయ్యారు. మానసిక వేదనకు గురయ్యానని అన్నారు. అప్పటి నుంచి ఆయన సోషల్ మీడియాల్ని ఇదే తీరుగా ఎండగడుతున్నారు. సీరియస్ హెచ్చరికల్ని జారీ చేస్తున్నారు.