చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటు చేసి కరోనా రోగులను అత్యవసరంలో ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయా జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షులు వీటిని నిర్వహిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్యవేక్షిస్తున్నారు.
కచ్ఛితంగా ఆక్సిజన్ అవసరం ఉన్న రోగుల్ని ఆదుకునేందుకు ప్రతిదీ మానిటర్ చేస్తున్నారు. చిరంజీవి ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంక్ ల నుంచి ఆక్సిజన్ అందాలంటే .. రోగుల కుటుంబీకులు డాక్టర్ లెటర్ ని RT PCR టెస్ట్ రిపోర్ట్ తో సంబంధిత జిల్లా శాఖ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. రోగి కుటుంబీకులకు ఆక్సిజన్ సిలిండర్లను రెగ్యులేటర్స్ తో అందిస్తారు.
నిన్నటిరోజున అనంతపురం గుంటూరు జిల్లాలకు ఆక్సిజన్ సిలిండర్లను పంపిన సంగతి తెలిసిందే. నేడు మరిన్ని జిల్లాలకు ఆక్సిజన్ సరఫరా ఉంటుంది. తెలంగాణ జిల్లాలకు సరఫరాకు ఏర్పాట్లు సాగుతున్నాయి. శరవేగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. అనునిత్యం వందలాది ఆక్సిజన్ సిలిండర్లు అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ కి పంపించేలా మెగాస్టార్ అనుయాయులు ఆఫీస్ సిబ్బంది హైదరాబాద్ బ్లడ్ బ్యాంక్ నుంచి ప్రతిదీ మానిటర్ చేస్తుండడం విశేషం. స్థానికంగా ఆక్సిజన్ పరికరాల ఏర్పాటుకు ఇబ్బంది కలగడంతో విదేశాల నుంచి వీటిని ఆర్డర్ ఇచ్చి రప్పిస్తున్నారని సిబ్బంది తెలిపారు.