త్రివిక్రమ్ స్పీచ్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. పేరే మాటల మాంత్రికుడు కాబట్టి తను ఏం మాట్లాడతాడో ఎలాంటి పదవిన్యాసంతో ఎవరి గురించి మాట్లాడతాడని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. తన స్పీచ్ మొదట్లోనే 'వినయ విధేయ రామ' కు టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చాడు త్రివిక్రమ్. బోయపాటి పెట్టిన ఈ టైటిల్ కు కంటెంట్ కు సూట్ కాలేదని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. మరి దానికి సమాధానం గురూజీ నోటి నుండి రావడం నిజంగా ఆశ్చర్యమే. పనిలో పనిగా బోయపాటి శ్రీను సినిమాలో తనకు నచ్చే అంశాన్ని కూడా ప్రస్తావించాడు గురూజీ.
త్రివిక్రమ్ ఏం మాట్లాడాడంటే "రాముడు మర్యదాపురుషోత్తముడు. తల్లి దగ్గర ఎంత వినయంగా ఉంటాడో.. తండ్రి దగ్గర అంత విధేయతతో ఉంటాడో.. శత్రువు దగ్గర అంత భయంకరంగా ఉంటాడు. అది టైటిల్ లో కన్పించడం లేదు కానీ టీజర్ లో కనిపించింది. ట్రైలర్ లోనూ.. బోయపాటి గారి సినిమాల్లో ఎలాగూ కనిపిస్తుంది. కమర్షియల్ సినిమా అంటే ఉదాత్తత లేకుండా ఉంటుంది. కానీ బోయపాటి గారి సినిమాల్లో అది ఉంటుంది. బుక్ లో ఉండే వ్యాల్యూస్ పాటించేవారు చాలా బోరింగ్ గా ఉంటారంటారు. కానీ వారిని చాలా ఎగ్జైటింగ్ గా చూపించగలిగే కెపాసిటీ ఉన్నవారు బోయపాటి గారు. అది అయన సినిమాల్లో నాకు బాగా నచ్చే అంశం."
"కుటుంబం బోరింగ్ గా ఉంటుంది.. అందరితో కలిసి భోంచేయడం బోరింగ్ గా ఉంటుంది.. వెజిటేరియన్ బోరింగ్.. పార్టీ లేకుండా ఉంటె బోరింగ్.. నిజం మాట్లాడడమే బోరింగ్... రాముడంటే బోరింగ్.. కాదు. రాముడు బోరింగ్ కాదు కాబట్టే ఇన్ని శతాబ్దాలు.. ఇన్ని యుగాలు గడిచిన తర్వాత కూడా ఇంకా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం. అలాంటి హీరో ఈ సినిమాలో మీ హీరో చరణ్. అందుకే మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని.. మిమ్మల్ని అందరినీ ఎంతో అలరిస్తుందని అనుకుంటున్నాను."