బోయపాటి పాన్ ఇండియా కుస్తీ పాట్లు?

Update: 2022-02-08 11:30 GMT
రామ్ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ సినిమా ప్లాప్‌ అయిన విషయం తెల్సిందే. ఆ సమయంలో బోయపాటి గురించి పలు పుకార్లు షికార్లు చేశాయి. ఆయన కెరీర్‌ ఖతం అయినట్లే అంటూ కొందరు కామెంట్స్ చేశారు. కానీ అందరి నోళ్లు మూయిస్తూ బాలయ్య తో అఖండ తీసి అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బాలయ్య తో తన మూవీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా బ్లాక్‌ బస్టర్ ఖాయం అంటూ బోయపాటి నిరూపించాడు. బాలయ్య.. బోయపాటిల కాంబోకు హ్యాట్రిక్‌ దక్కింది. అఖండ జోరుతో ఉన్న బోయపాటి ఇప్పటికే అల్లు అర్జున్ తో సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అల్లు అరవింద్‌ స్వయంగా ఆ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌ లో నిర్మించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. అందుకు సంబంధించిన విషయాలు కూడా చర్చలు జరిగాయి.

అల్లు అర్జున్‌ ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో సరైనోడు సినిమాను చేసి మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఆ సినిమా తో దక్కించుకున్నాడు. అందుకే బోయపాటి తో సినిమాకు బన్నీ ఆసక్తి చూపించారు. కాని చూస్తుండగానే కాలం తిరిగి పోయింది.. పుష్ప సినిమా తో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప సినిమా తర్వాత ఆయన చేసే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండబోతున్నాయి. ప్రభాస్‌ ఎలా అయితే భారీ సినిమాలను ప్లాన్‌ చేసుకుంటూ పాన్ ఇండియా సూపర్ స్టార్‌ గా దూసుకు పోతున్నాడో అదే తరహాలో బన్నీ కూడా ప్లాన్‌ చేసుకోవాలని భావిస్తున్నాడట. ప్రస్తుతానికి పుష్ప 2 పైనే పూర్తి దృష్టి పెట్టబోతున్న బన్నీ ఆ తర్వాత కూడా పాన్ ఇండియా సినిమానే కావాలంటున్నాడట. దాంతో బన్నీ మరియు బోయపాటి కాంబో మూవీ క్యాన్సిల్‌ అయినట్లేనా అనే చర్చ జరుగుతోంది.

తాజాగా బోయపాటి తన తదుపరి సినిమాను రామ్‌ తో చేసేందుకు సిద్ధం అయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రామ్‌ కు కథ వినిపించడం ఓకే చెప్పడం చకచక జరిగి పోయాయట. రామ్‌ తో బోయపాటి మూవీ సినిమా వార్తలు రావడంతో బన్నీ తో బోయపాటి మూవీ క్యాన్సిల్‌ అయినట్లుగానే అంతా భావిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారు కూడా దాదాపుగా ఈ సినిమా క్యాన్సిల్‌ అయినట్లే అంటున్నారు. ఈ సమయంలో అల్లు అర్జున్‌ ను వెళ్లి బోయపాటి శ్రీను కలవడం చర్చనీయాంశంగా మారింది. బన్నీ కి తన వద్ద ఉన్న ఒక పాన్‌ ఇండియా సబ్జెక్ట్‌ ను వినిపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. బన్నీ ఇమేజ్ కు తగ్గట్లుగా పాన్‌ ఇండియా సబ్జెక్ట్‌ మరియు మేకింగ్‌ తో బోయపాటి రెడీ అవుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. బోయపాటి సినిమాలు పాన్ ఇండియా అప్పిల్‌ తో అంటే కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా.. ప్రస్తుతానికి బోయపాటి అందుకోసం కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. మరి బన్నీని ఆ పాన్ ఇండియా సబ్జెక్ట్‌ తో బోయపాటి ఒప్పించేనా చూడాలి.

Tags:    

Similar News