మోక్ష‌జ్ఞ ఎంట్రీకి డైరెక్ట‌ర్ ఫైన‌ల్‌?

Update: 2021-12-19 11:00 GMT
మోక్ష‌జ్ఞ‌. నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ముద్దుల వార‌సుడు. మోక్ష‌జ్ఞ‌ని హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని గ‌త కొన్నేళ్లుగా బాల‌య్య ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ అంశం ఇండస్ట్రీలో ప్ర‌తీ ఏడాది హాట్ టాపిక్ అవుతూనే వుంది. `గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి` సినిమా స‌మ‌యంలో సింగీతం శ్రీ‌నివాస రావు `ఆదిత్య 369`కిసీక్వెల్ ని చేయాల‌ని ఓ క‌థ‌ని వినిపించారు. దానికి `ఆదిత్య 999` అనే టైటిల్ ని కూడా అనుకున్నారు. ఇదే సినిమా ద్వారా మోక్ష‌జ్క్ష హీరోగా ప‌రిచ‌యం అవుతుతార‌ని, బాల‌య్య ఇందులో ప్ర‌ధాన హీరోగా న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

ఇదే విష‌యాన్ని బాల‌కృష్ణ కూడా వెల్ల‌డించారు కాడా. కానీ ఇది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఆ త‌రువాత కూడా బాల‌య్య త‌న వార‌సుడిని ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌ల్ని ద‌ర్శ‌కుడు క్రిష్ కి అప్ప‌గించ‌బోతున్నారంటూ వార్త‌లు షికారు చేశాయి. `లెజెండ్‌` సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో కూడా మోక్ష‌జ్ఞ‌ని బోయ‌పాటి శ్రీ‌ను ప‌రిచ‌యం చేసే అవ‌కాశం వుందంటూ వార్త‌లు వినిపించాయి కూడా కానీ అవి ఇప్ప‌టికీ కార్య‌రూపం దాల్చ‌లేదు. అదంతా ఒట్టి పుకారే న‌ని అంతా కొట్టి పడేశారు. కానీ తాజాగా మోక్ష‌జ్ఞ తెరంగేట్రం చేయ‌బోతున్నాడంటూ మ‌ళ్లీ వార్త‌లు మొద‌ల‌య్యాయి.

ఇటీవ‌ల మోక్ష‌జ్ఞ 27లోకి వ‌చ్చేయ‌డంతో ఇదే అత‌నికి స‌రైన స‌మ‌య‌మ‌ని, వ‌చ్చే ఏడాది అత‌న్ని హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం ఖాయ‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవ‌ల బాల‌య్య‌కు `అఖండ‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించిన బోయ‌పాటి శ్రీ‌ను... మోక్ష‌జ్క్ష‌ని ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌ల్ని తీసుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.

బ‌న్నీతో బోయ‌పాటి ఓ సినిమా చేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో వున్నారు. అయితే అది ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సెట్స్ పైకి రావ‌డానికి మ‌రి కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం వుండ‌టంతో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను త‌న త‌దుప‌రి చిత్రాన్ని మోక్ష‌జ్ఞ తో చేయ‌బోతున్నాడ‌ట‌. బాల‌య్య కూడా బోయ‌పాటి విష‌యంలో సుముఖంగా వుండ‌టంతో త్వ‌ర‌లోనే మోక్ష‌జ్క్ష తెరంగేట్రానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News