వరుసగా లెజెండ్.. సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్లతో టాప్ డైరెక్టర్ల లిస్టులోకి ఎక్కేశాడు బోయపాటి శ్రీను. ఐతే ఆల్ హ్యాపీస్ అనుకుంటున్న టైంలో బోయపాటిపై ఇద్దరు ప్రముఖులు తీవ్ర ఆరోపణలు చేశారు. అందులో ఒకరు కొరటాల శివ అయితే.. మరొకరు పోసాని కృష్ణమురళి. కొరటాల బోయపాటికి మిత్రుడైతే.. పోసాని అతడికి గురువు లాంటి వాడు. వాళ్లిద్దరూ చేసిన వ్యాఖ్యలతో బోయపాటి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఐతే ఈ ఆరోపణలపై బోయపాటి ఇప్పటిదాకా ఏమీ స్పందించలేదు. మీడియా వాళ్లకు కూడా ఈ ఆరోపణలపై అడిగే అవకాశమివ్వలేదు బోయపాటి.
ఐతే త్వరలో ప్రొద్దుటూరులో ‘లెజెండ్’ 1000 రోజుల వేడుకకు హాజరు కాబోతున్నాడు బోయపాటి. ఆ వేడుక సందర్భంగా పోసాని.. కొరటాల ఆరోపణల మీద స్పందిస్తూ.. వాళ్లపై రివర్స్ అటాక్ చేయాలని బోయపాటి భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మీడియాకు లీక్స్ కూడా వచ్చాయి. ఐతే బోయపాటి ఇలా కౌంటర్ ఇవ్వడం కరెక్టేనా అన్న చర్చ నడుస్తోంది ఇప్పుడు. పోసాని.. కొరటాల ఇద్దరూ కూడా ఇండస్ట్రీలో క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు. అందులోనూ పోసాని గురించైతే చెప్పనవసరం లేదు. ఆయన ఏదున్నా మొహం మీద మాట్లాడేస్తారు.
నిజాయితీపరుడు.. అబద్ధం ఆడడు అన్న అభిప్రాయం అందరిలో ఉంది. అలాంటి వ్యక్తిపై రివర్స్ అటాక్ చేశాడంటే బోయపాటికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. పోసాని ఆవేశం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మొన్న టీవీలో చర్చా కార్యక్రమం సందర్భంగా వీహెచ్ లాంటి పెద్ద రాజకీయ నేతనే వదల్లేదు. అలాంటిది బోయపాటి ఏమైనా తేడా మాట్లాడితే అంతే సంగతులు. ఆ తర్వాత పోసాని అటాక్ మామూలుగా ఉండదు. కాబట్టి పోసాని గురించి మాట్లాడే విషయంలో బోయపాటి కాస్త ఆలోచించుకుంటే బెటర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/