అవకాశవాది నంబర్-1 అంటూ కంగ‌న‌పైనే క‌త్తి దూసాడు!

Update: 2022-05-20 03:32 GMT
కంగనా రనౌత్ తన స్వ‌ప్రయోజనం కోసం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరును ఉపయోగించుకుందని.. సల్మాన్ ఖాన్ తో సాన్నిహిత్యం కోసం వెంప‌ర్లాడుతూ చేయ‌కూడ‌ని త‌ప్పు చేసింద‌ని సుశాంత్ సింగ్ అభిమానులు ఆరోపిస్తున్నారు!

``ధాకడ్ ను బహిష్కరించాలి`` అనే హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ తో ఉన్న‌ట్టుండి ఆమె సన్నిహితంగా ఉండటంపై అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంత‌రం బాలీవుడ్ మాఫియా పైనా స్టార్ హీరోల‌పైనా ఫిరంగులు విసిరే కంగ‌న ఇప్పుడిలా మారిపోయిందేమిటీ? అంటూ నెటిజ‌నులు త‌న‌లోని లోపాన్ని ఎత్తి చూపిస్తున్నారు. కంగ‌న ఇంత‌లోనే ఎంత‌గా మారిపోయింది? అని స‌ల్మాన్ తో స‌న్నిహిత వీడియోల‌ను వైర‌ల్ చేస్తున్నారు. ఇదంతా ధాక‌డ్ ప్ర‌మోష‌న్స్ కోస‌మేనా?  ఎవ‌రైనా ఇలా చేస్తారా? అంటూ నిల‌దీస్తున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 20202లో మరణించినప్పుడు అతని కేసును సమర్థించిన మొదటి ప్రముఖురాలిగా కంగనా రనౌత్ పేరు వినిపించింది. ఇప్పుడు అభిమానులు ఆమెను తన స్వీయ ప్రయోజనాల కోసం అత‌డి పేరును ఉపయోగించుకున్నారని ఆరోపిస్తున్నారు. ట్విట్టర్ లో #BoycottDhaakad ను ట్రెండ్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ తో ఆమె సన్నిహితంగా ఉండటంపైనా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కంగ‌న‌ ఇటీవల అర్పితా ఖాన్ హోస్టింగ్ చేసిన ఈద్ పార్టీలో కంగ‌న‌ కనిపించింది. ఈ పార్టీలో తాను న‌టించిన `ధాకడ్` ట్రైలర్ ను షేర్ చేసిన తర్వాత సల్మాన్‌కి కృతజ్ఞతలు తెలిపింది. అయితే దీనిపై ఒక నెటిజ‌నుడు తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. SSR కేసు బాలీవుడ్ లోపాల‌ను బహిర్గతం చేసిందా ? హిపోక్రసీకి ముఖం ఉంటే అది కంగనా రనౌత్ అవకాశవాది నంబర్-1 #BoycottBollywood #BoycottDhaakad.. అంటూ  నిన‌దించారు. #ధాక‌డ్ ని బహిష్కరించబోతున్నారా? ఇస్నే SSR కేస్ కో సబ్సే జాదా యూజ్ కరా హై అప్నే ఫ‌యాదే కే లియే మ‌త‌ల‌బీ కహిన్ కీ .. అంటూ మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. కంగ‌న పై నెటిజ‌నుల్లో భిన్న స్వ‌రాలు వినిపిస్తున్నాయి.

`ధాకడ్`లో అర్జున్ రాంపాల్ కూడా నటించారు. 20 మే 2022న ఈ మూవీ విడుదల కానుంది. ఇది కార్తిక్ ఆర్యన్- కియారా అద్వానీ -టబు నటించిన భూల్ భూలయ్యా 2తో ఢీకొట్ట‌నుంది.
Tags:    

Similar News