కొడుకు విడాకులపై బ్రహ్మాజీ ట్వీట్

Update: 2017-04-22 07:18 GMT
సినీ నటుడు బ్రహ్మాజీ తన కుమారుడి వైవాహిక బంధంపై ట్విట్టర్ వేదికగా స్పష్టత ఇచ్చారు. తన కుమారుడు సంజయ్‌ - అతని భార్య ఇంద్రాక్షి త‍్వరలో విడాకులు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. గత అయిదు నెలలుగా తన కొడుకు, కోడలు వేర్వేరుగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోనున్నారని ఆయన ప్రకటించారు.
    
కాగా ఈ జంట విడిపోయాక మరో కొత్త జీవితం ప్రారంభించాలని, వారి భవిష్యత్ ఆనందంగా సాగిపోయేలా ఆశీర్వదించాలంటూ బ్రహ్మాజీ ట్వీట్ చేశారు.  సంజయ్ వివాహం 2013లో పశ్చిమ బెంగాల్ కు చెందిన  ఫ్యాషన్ డిజైనర్ ఇంద్రాక్షితో అయింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తరువాత ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News