హీరో నవదీప్ గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ శుద్ధ అబద్ధం అంటున్నాడు సీనియర్ నటుడు బ్రహ్మాజీ. తన ఫామ్ హౌస్ లో నవదీప్ రేవ్ పార్టీ నిర్వహించాడని.. కొందరు టాలీవుడ్ ప్రముఖులు అందులో పాలు పంచుకున్నారని.. అమ్మాయిలతో డ్యాన్సులు చేశారని.. పోలీసులు దాడి చేయడంతో పరారయ్యారని నిన్న రాత్రి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే అది అసలు రేవ్ పార్టీనే కాదని.. ఓ ఫ్యామిలీ పార్టీ అని అంటున్నాడు బ్రహ్మాజీ.తాను కూడా తన కుటుంబంతో కలిసి ఆ పార్టీలో పాల్గొన్నట్లు బ్రహ్మాజీ వెల్లడించాడు.
నవదీప్ పై వస్తున్న వార్తలన్ని అవాస్తవాలని.. తాను కూడా కుటుంబ సమేతంగా ఆ పార్టీలో పాల్గొన్నానని బ్రహ్మాజీ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇది పిల్లలు - కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన ఫాం హౌస్ పార్టీ అంటూ ట్వీట్ చేశాడు. ఐతే నవదీప్ మాత్రం ఇది గృహ ప్రవేశ కార్యక్రమం అంటూ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది రేవ్ పార్టీ అంటూ వార్తలు రాసిన మీడియా మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు నవదీప్. ఫ్యామిలీ పార్టీ అయితే గొడవ ఎందుకు జరిగింది.. పోలీసులు ఎందుకు జోక్యం చేసుకున్నారు.. మీడియా వరకు వ్యవహారం ఎందుకు చేరింది అన్నది అర్థం కాని విషయాలు. అసలు నిన్న రాత్రి జరిగిందన్నది పోలీసులైనా క్లారిటీ ఇస్తే బెటరేమో.