శ్రీనువైట్ల కాన్సెప్టే వేరు! సెటైరికల్ కామెడీలు తెరెక్కించడంలో అతడు నిష్ణాతుడు. కోన అండ్ గ్యాంగ్‌తో ఈసారి ఓ అసిస్టెంట్ ఫైట్‌మాష్టర్ ఎలా ఉంటాడు? బాడీ డబుల్ ఆర్టిస్టుతో ఎలాంటి కామెడీ చేయించవచ్చు? అన్న రీసెర్చ్ చేయించుకున్నాడు. ఇప్పుడు ఆ కథని తెరకెక్కిస్తూ సెట్‌లో ఉరకలెత్తిస్తున్నాడు.
ప్రస్తుతం చరణ్, బ్రహ్మాజీలపై ఓ ఆసక్తికరమైన ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తున్నాడు శ్రీనూ. కథ ప్రకారం బ్రహ్మాజీ ఈ చిత్రంలో హీరో. సహజంగానే హీరోకి ఫైటింగులు రావు కాబట్టి అతడికి బాడీ డబుల్ ఆర్టిస్టు తప్పనిసరి. సరిగ్గా చెర్రీ రంగంలోకి దిగుతాడు. బ్రహ్మాజీకి డూప్‌గా ఫైట్స్ ఇరగదీస్తాడన్నమాట. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కొందరు హీరోలపై సెటైర్ కూడా వేయబోతున్నాడు వైట్ల. దీనికోసం ఎవరైతే టాలీవుడ్ హీరోలు కాలు కదిపి ఫైట్ చేయలేరో వాళ్లను టార్గెట్ చేశాడని టాక్ వినిపిస్తోంది.
వెన్ను నొప్పి ఉన్న హీరోలు, బట్టతల హీరోలు, డైలాగ్ సరిగా చెప్పలేని హీరోలు, ఫైట్స్ సరిగా చేయలేని హీరోలు ... ఇంతమందిని రింగులోకి లాగాడు. ఈసారి ఇలాంటి హీరోలందరిపైనా పంచ్ వేస్తున్నాడు. సదరు హీరో రూపంలోకి బ్రహ్మాజీని పరకాయం చేయిస్తున్నాడు. అక్టోబర్ రిలీజ్ కోసం చిత్రీకరణలో వేగం పెంచాడు వైట్ల. అదీ సంగతి.