తెలుగు సినిమా ఇండస్ట్రీని సైరా మూవీ ఒక ఊపు ఊపుతుంది. విడుదలైన అన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ కల్లెక్షన్స్ తో రన్ అవుతుంది. దీనికోసం నిర్మాత రాంచరణ్,హీరో చిరంజీవి, దర్శకుడు సురేంద్ర రెడ్డి లాంటి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. చిరంజీవి అరవై సంవత్సరాల వయసులో కూడా గుర్రపు స్వారీలు, కత్తి యుద్దాలు చేసి అభిమానులతో శభాష్ అనిపించుకున్నారు. వీళ్ళే కాదు ఈ సినిమాలో నటించిన మిగిలిన నటీ నటులు కూడా చాలా కష్టపడ్డారు.
వారిలో ముందుగా యాక్టర్ బ్రహ్మాజీ గురించి చెప్పుకోవాలి. ఇందులో ఒక పాత్ర కావాలని చరణ్ ని అడిగితే చాలా ఎక్కువ నిడివి ఉన్న పాత్ర ఇచ్చాడని బ్రహ్మాజీ అన్నారు. ఆ పాత్ర బాగా రావడం కోసం తాను హార్స్ రైడింగ్ నేర్చుకున్నానని, గుండు కూడా కొట్టించుకున్నానని చెప్పారు. అంతేకాదు రాంచరణ్ పక్కనే ఉండి తనకు గుండు కొట్టిస్తున్న చిత్రాన్ని కూడా బ్రహ్మాజీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తనకు ఇంత మంచి క్యారక్టర్ ఇచ్చినందుకు బ్రహ్మాజీ సినిమా యూనిట్ మొత్తానికీ కృతజ్ఞతలు చెప్పారు.