తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు. తెర మీద ఆయన ఎంట్రీ ఇచ్చినంతనే థియేటర్లో నవ్వులు పువ్వుల మాదిరి విచ్చుకుంటాయి. చాలా సినిమాల్ని తన భుజస్కందాల మీద వేసుకొని నడిపించిన వైనాన్ని అస్సలు మర్చిపోలేం. దాదాపు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన బ్రహ్మానందానికి సంబంధించిన ఒక ఆసక్తికర కథనాన్ని ఒక ఇంగ్లిష్ మీడియా సంస్థ ప్రత్యేక కథనంగా ప్రచురించింది.
ఇందులోని అంశాలు ఇప్పుడు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. తాజా కథనంలో బ్రహ్మానందం గురించి బయటపెట్టిన విషయాల్లో అందరి దృష్టిని ఆకర్షించుకునేది ఆయన ఆస్తుల ముచ్చటే. సదరు మీడియా సంస్థ లెక్కల ప్రకారం.. స్థిరాస్తి.. చరాస్తి కలుపుకొని బ్రహ్మీకి రూ.320 కోట్లకు పైనే ఉంటుందన పేర్కొంది. బ్రహ్మానందానికి ఆడి ఆర్8.. ఆడి క్యూ 7..బ్లాక్ బెంజ్ కార్లతో పాటు.. వ్యవసాయ క్షేత్రంలో కోట్లాది మంది సముదాయాన్ని సొంతం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. తాజా కథనం ప్రకారం ఆయన స్థిరాస్తి.. చరాస్తుల ఎంతన్నది బయటపెట్టింది. వీటితో పాటు జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన భవనం ఉందని పేర్కొంది.
మెగాస్టార్ చలువతో తానీ రంగంలో ఉన్నట్లుగా బ్రహ్మానందం చెబుతారు.దివంగత జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి చంటబ్బాయ్ సినిమాను చేస్తున్న వేళ.. చిరుకు పరిచయమైనట్లు వెల్లడించారు. బ్రహ్మీలో టాలెంట్ గుర్తించి.. జంధ్యాలకు చెప్పటం.. ఆయన ఓకే అనేయటంతో ఆయన తీరు పూర్తిగా మారిందని.. అప్పటి నుంచి వరుస సినిమాల్లో నటిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏమైనా ఒక కమేడియన్ ఆస్తి.. సగటు హీరోలకు మించి ఉండటం ఆసక్తికరంగా మారింది. వందల కోట్లను వెనుకేసే విషయంలో బ్రహ్మీ మిగిలిన వారితో పోలిస్తే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ కావటం ఆయనకే చెల్లుతుందని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/