బ్ర‌హ్మీ స్పందించాడు!

Update: 2015-08-06 04:17 GMT
న‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ `మా` (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్)  అధ్య‌క్షుడిగా ఎన్నిక‌వ‌డంతో మేలే జ‌రిగింది. ఈసారి పొలిటిక‌ల్ ఎలెక్ష‌న్ల టైపులో పోటాపోటీ గా ఎన్నిక‌లు జ‌ర‌గ‌డంతో గెలుపు కోస‌మ‌ని ఇటు రాజేంద్ర‌ప్ర‌సాద్, అటు జ‌య‌సుధ పెద్ద‌యెత్తున హామీలిచ్చారు. గ‌త కార్య‌వ‌ర్గం పై ఉన్న వ్య‌తిరేక‌త వ‌ల్ల రాజేంద్ర‌ప్ర‌సాద్ ఎన్నిక‌ల్లో  గెలిచాడు. దీంతో ఆయ‌న  ఇదివ‌ర‌క‌టి కార్య‌వ‌ర్గం కంటే ఎక్కువ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి శ‌భాష్ అనిపించుకోవాల‌ని కంక‌ణం క‌ట్టుకొన్నాడు. అందుకే ఇచ్చిన హామీల‌న్నింటినీ నెర‌వేర్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. స్నేహితులు స‌న్నిహితుల దగ్గ‌రికి వెళ్లి పేద క‌ళాకారుల కోసం విరాళాలు సేక‌రిస్తున్నాడు. ఆ ప్ర‌య‌త్నాన్ని గ‌మ‌నిస్తున్న తోటి న‌టులు, కార్పొరేట్లు స్పందిస్తూ రాజేంద్ర‌ప్ర‌సాద్ మ‌రింత అండ‌గా నిలుస్తూ స్పందిస్తున్నారు.

హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం కూడా తోటి క‌ళాకారుల‌కు `మా` ఆధ్వ‌ర్యంలో  సాయం చేసేందుకు న‌డుం బిగించాడు. పేదలైన ప‌ది మంది క‌ళాకారుల‌కు నెల‌కి రూః 1500 చొప్పున యేడాదిపాటు సాయం చేయ‌బోతున్నాడ‌ట బ్ర‌హ్మానందం. ఇది ఇన్షియ‌ల్‌ గానేన‌ట‌. ముందు ముందు మ‌రింత పెద్ద సాయం చేయాల‌ని బ్ర‌హ్మీ నిర్ణ‌యించుకొన్న‌ట్టు మా కార్య‌వ‌ర్గ స‌భ్యుడు కాదంబ‌రి కిర‌ణ్ చెబుతున్నాడు. మ‌రి బ్రహ్మీ భ‌విష్య‌త్తులో ఇంకా ఎలాంటి సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డతాడో చూడాలి. తోటి క‌ళాకారుల గురించి ఆలోచించి సాయం చేయ‌డానికి ముందుకొచ్చిన బ్ర‌హ్మానందంని అభినందించాల్సిందే. కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్లు తీసుకొని ఇత‌ర న‌టులు కూడా బ్ర‌హ్మానందంలా స్పందిస్తే పేద క‌ళాకారుల‌కు మ‌రింత మేలు జ‌రుగుతుంది.
Tags:    

Similar News