'మా' ఎన్నికలు ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. జూబ్లీ హిట్స్ లోని పబ్లిక్ స్కూల్ లో 8గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సినీ తారలు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ 'మా' ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకున్నారు. అందరికంటే ముందే ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకొని మొదటి ఓటు వేశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు.
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు మా పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు రాత్రి ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
పవన్ తర్వాత వరుసగా చిరంజీవి, రాంచరణ్, బాలక్రిష్ణ, నరేశ్, సాయికుమార్, శివాజీరాజా, సుడిగాలి సుధీర్ సహా సినీ ప్రముఖులు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ క్రమంలోనే ఓటు వేసేందుకు సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందం వచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు స్వాగతం పలికేందుకు అక్కడే ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీపడ్డారు. ఈ క్రమంలోనే ఓటు వేయడానికి అందరినీ తోసేసి బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లాడు బ్రహ్మానందం. అనంతరం లోపలికి వెళ్లి ఓటు వేశాడు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ తో కలిసి మంచు విష్ణు మీడియాకు వివరించాడు.
'మా ఇద్దరికీ అర్థం కాని విషయం ఏంటంటే.. బ్రహ్మానందం అందరినీ తోసి ఆయన బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లి గుద్దారు. అది ప్రకాష్ రాజ్ కు గుద్దారా? నాకు గుద్దారా? తెలియట్లేదు. అడిగినందుకు ఆయన గట్టిగా అరిచారు' అని మంచు విష్ణు తెలిపారు.