మొఖం కనబడితేనే కాదు మాట వినబడినా పగలబడి నవ్వుకునే సినీ చరిత్ర బ్రహ్మానందానిది. అరగుండుతో, చిలిపిచేష్టలతో ఎన్నో సినిమాలలో హీరోలకు మించి స్క్రీన్ టైం ని, కామెడి టైమింగ్ ని దక్కించుకున్న ఈ కామెడి కింగ్ గత కొంతకాలంగా బొంగులాంటి కామెడి చేస్తున్నాడన్నది వాస్తవం.
అయితే ఈ కష్టాలన్నీ తన తదుపరి సినిమాతో తీరిపోతాయని బ్రాహ్మి బాబాయ్ ఆశిస్తున్నాడట. పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో మరోసారి బ్రాహ్మి పాత బ్రహ్మానందాన్ని గుర్తుచేస్తాడట.
ఇటీవలే షూట్ చేసిన ఒక సన్నివేశం అద్భుతంగా వచ్చిందని, షూటింగ్ సమయంలో నవ్వు ఆపుకోలేకపోయానని దర్శకుడు బాబీ తెలిపాడు. ఆ సన్నివేశం పూర్తయిన వెంటనే బ్రహ్మిని పవన్ అభినందిస్తే, బాబీ గట్టిగా కౌగిలించుకున్నాడట. మరి అలాంటి సీన్లు చూడడానికేగా మనం ఎదురుచూస్తుంది. త్వరగా దించేయండి..