నా పేరు దయ.. నాకు లేనిదే అది అంటూ `సినిమా చూపిస్త మావ` ట్రైలర్ లో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్, చేసిన ఫైట్లను చూసి అంతా చాలా ఎక్స్ పెక్ట్ చేశారు. బ్రహ్మీ మరోసారి పేరడీ చేసి నవ్వించేసుంటాడని బోలెడన్ని ఆశలతో అంతా థియేటర్ కి వెళ్లారు. కానీ అక్కడ మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది. బ్రహ్మీ ఎంట్రీ ఇస్తాడు.. ఇస్తాడు అంటూ ఎదురు చూసినవాళ్లకి క్లైమాక్స్ వచ్చింది కానీ బ్రహ్మీ మాత్రం కనిపించలేదు. ఆ తర్వాత తెలిసిందేంటంటే...బ్రహ్మీని కటింగుల్లో లేపేశారని! అది కూడా దిల్ రాజు ప్రోద్భలంతోనే జరిగిందట. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని హోల్ సేల్ గా కొనేసిన దిల్ రాజు సినిమాని చూసి మరీ లాగింగ్ ఉందని బ్రహ్మీ, సప్తగిరి కామెడీ ట్రాక్ మొత్తం లేపేశాడట. దాని గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకొన్నారు. బ్రహ్మీపై కక్షసాధింపు చర్యగానే ఆయన సన్నివేశాల్ని దిల్ రాజు తీసివేయించాడని మాట్లాడుకొన్నారు. కానీ దిల్ రాజు మాత్రం నిజంగానే లాగ్ అవుతాయని ఆ సన్నివేశాల్ని తొలగించాడట. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలో బ్రహ్మీ ట్రాక్ ని కలపబోతున్నట్టు తెలిసింది.
పది నిమిషాల పాటు సాగే ఆ ట్రాక్ ని శుక్రవారం నుంచి కలిపేసి కొత్త వర్షన్ సినిమాని ప్రదర్శించబోతున్నారట. ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొన్న `సినిమా చూపిస్త మావ`కి ఈ సన్నివేశాలు మరింత ప్లస్ గా మారే అవకాశాలున్నాయి. ఇటు పుకార్ల కి పుల్ స్టాప్ పెట్టేలా, అటు ప్రచారానికి పనికొచ్చేలా ఉంటాయని బ్రహ్మీ సన్నివేశాలు కలుపుతున్నట్టు తెలుస్తోంది. రాజ్ తరుణ్, అవికాగోర్ జంటగా నటించిన ఈ సినిమా `జబర్దస్త్` షో తరహా కామెడీ సన్నివేశాలతో తెరకెక్కింది. సినిమాకి కూడా ఆ సన్నివేశాలే కీలకంగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు.