బాలీవుడ్ కి ధీటుగా ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీలో కలెక్షన్స్ రేటు చాలా పెరుగుతోంది. పైగా అందరు మాట్లాడుకునేలా సినిమాలు వస్తున్నాయని టాలీవుడ్ ని జాతీయ మీడియా సైతం ప్రశంసల జల్లును కురిపించింది. ముఖ్యంగా బాహుబలి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక డబ్బింగ్ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు సరికొత్త అర్దాన్ని చెప్పింది. అయితే అందుకు పోటీని ఇవ్వాలని ఇప్పుడు బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తోంది.
ఒక ఫాంటసీ కథను అందించాలని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ రంగం సిద్ధం చేస్తున్నాడు. ఎప్పుడు లేని విధంగా ధర్మా ప్రొడక్షన్ లో కరణ్ 200 కోట్లను ఖర్చు పెట్టడానికి సిద్దమయ్యాడు. రన్ బీర్ కపూర్ ప్రధాన పాత్రలో ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో బ్రహ్మాస్త్ర అనే సినిమాను ఎప్పటి నుంచో సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఫైనల్ గా సినిమాకు ఇప్పుడు సమయం సెట్ అయ్యింది. 200 కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారు.
ఈ సినిమాలో రన్ బీర్ అద్భుతమైన శక్తులతో ఒక ధీరుడిగా కనిపిస్తాడట. ప్రత్యేక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఓ షెడ్యూల్ ని పూర్తి చేయగా మరొక షెడ్యూల్ ని నెల రోజుల తరువాత ప్లాన్ చేయనున్నారు. భారీ తారాగణంతో ఎక్కువ బడ్జెట్ తోనిర్మిస్తోన్న ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో గాని కరణ్ జోహార్ చేస్తోంది మాత్రం పెద్ద సాహసమనే చెప్పాలి. చూడాలి మరి బాహబలి స్థాయిని ను క్రాస్ చేస్తుందో లేదో?