మిక్స్ డ్ టాక్ వ‌స్తే సీక్వెల్ అంటారేంటీ?

Update: 2022-09-11 00:30 GMT
ఓవైపు ఎన్నో ఆశ‌ల న‌డుమ భారీ పాన్ ఇండియా చిత్రం బ్ర‌హ్మాస్త్ర విడుద‌లైంది. కానీ ఆ ఆశ‌ల్ని బాక్సాఫీస్ వ‌ద్ద‌ నిల‌బెడుతుందా? అంటే సందిగ్ధ‌త నెల‌కొంది. బ్ర‌హ్మాస్త్ర‌కు హిందీ బెల్ట్ లో మంచి ఓపెనింగులు వ‌చ్చాయ‌ని క‌థ‌నాల‌తో బాలీవుడ్ మీడియా హైప్ క్రియేట్ చేస్తున్న వైనం బ‌య‌ట‌ప‌డుతోంది. అయితే ఆ హైప్ సౌత్ లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇక్క‌డ బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఆ న‌మ్మ‌కం లేదు. తెలుగు నాట‌ ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. టాక్ ని బ‌ట్టి చూస్తే మిశ్ర‌మ స్పంద‌న‌లే వ్య‌క్త‌మ‌య్యాయి. భారీ వీఎఫ్ ఎక్స్ యాక్ష‌న్ మెప్పించినా కానీ ఎమోషన్ క‌నెక్ట్ కాలేద‌ని క‌థ స‌రిగా లేద‌ని ..క‌న్ఫ్యూజన్ నేరేష‌న్ మెప్పించ‌లేద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. ముఖ్యంగా బాహుబ‌లి- ఆర్.ఆర్.ఆర్ త‌ర‌హాలో క‌థాంశం కానీ ఎమోష‌న్ కానీ క‌నెక్ట్ కాలేదని క్రిటిక్స్ విమ‌ర్శించారు.

స్టార్ ప‌వ‌ర్ .. క‌రణ్ స్టామినా వ‌ల్ల తొలి వీకెండ్ లో హిందీ బెల్ట్ లో భారీ వ‌సూళ్ల‌ను సాధించినా కానీ సోమ‌వారం నుంచి ఈ మూవీకి అస‌లైన టెస్ట్ మొద‌ల‌వుతుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇప్ప‌టికి బ్ర‌హ్మాస్త్ర రిజ‌ల్ట్ గురించి ప్ర‌స్థావించ‌డం స‌రికాదు కానీ.. ఈ మూవీపై కంగ‌న లాంటి భామ‌లు తీవ్ర స్వ‌రంతో విరుచుకుప‌డ‌డం.. కొంద‌రు హిందీ క్రిటిక్స్ విమ‌ర్శ‌లు గుప్పించ‌డం కొంత‌వ‌ర‌కూ మైన‌స్ అనే చెప్పాలి.

ఒక సెక్ష‌న్ మీడియా విశ్లేష‌ణ‌ల ప్ర‌కారం..  బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వద్ద ఆరంభ వ‌సూళ్ల ప‌రంగా మెరుగైన వ‌సూళ్లు సాధిస్తోంద‌ని మాత్ర‌మే ప్ర‌చారం ఉంది. మూడు జాతీయ మల్టీప్లెక్స్ చెయిన్ లలో ప్రారంభ రోజు .. మొదటి వారాంతం రెండింటిలోనూ ముందస్తు బుకింగ్ లు స‌హా  సింగిల్ స్క్రీన్ లలో అడ్వాన్స్ బుకింగ్ ల‌తో కలిపి ఉత్త‌మ ఆరంభం సాధించింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.  రణబీర్ కపూర్ - అలియా భట్ కెరీర్ కి ఉత్త‌మ ఓపెనింగ్ వ‌సూళ్ల చిత్ర‌మిద‌ని ప్ర‌చారం సాగుతోంది. నిజానికి బాలీవుడ్ మీడియా మునుపెన్న‌డూ లేనంత‌గా ఈ మూవీని హైప్ చేయ‌డం స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. బ్రహ్మాస్త్ర ట్రైలర్ ఆశించినంత ర‌క్తి క‌ట్టించ‌క‌పోయినా కానీ.. పాటలు ఆక‌ట్టుకున్నాయి. ప్రమోషన్స్ క‌లిసొచ్చాయ‌ని విశ్లేషిస్తున్నారు.

అయితే సౌత్ లో డివైడ్ టాక్ దృష్ట్యా ఈ చిత్రం ఏ మేర‌కు రాణిస్తుంద‌న్న‌ది వేచి చూడాల్సి ఉది. ఇక బ్ర‌హ్మాస్త్ర రిజ‌ల్ట్ తేల‌క ముందే ఒక సెక్ష‌న్ బాలీవుడ్ మీడియా సీక్వెల్ గురించి మాట్లాడుతోంది. కాస్త అడ్వాన్స్ డ్ థింకింగ్ తో బ్రహ్మాస్త్ర 2 (స్పాయిలర్)లో దీపికా పదుకొణె పాత్ర గురించి క‌థ‌నాలు వండి వార్చ‌డం మీడియా హైప్ ని బ‌హిర్గ‌తం చేస్తోంది.

బ్రహ్మాస్త్రలో రణబీర్ కపూర్ పాత్ర‌ తల్లిదండ్రులతో ముడిప‌డిన కోణం ఆసక్తిని క‌లిగించింది. ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న అంశం.. సినిమాను పూర్తిగా భిన్నమైన స్థాయికి తీసుకువెళ్లింది. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కోసం వేచి చూసేలా చేసింద‌ని ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియాలు క‌థ‌నాలు రాసాయి.

బ్ర‌హ్మాస్త్ర సీక్వెల్లో దీపికా పదుకొనే రణబీర్ కపూర్ తల్లిగా నటించవచ్చని కూడా ప్ర‌ముఖ మీడియా క‌థ‌నం వండి వార్చ‌డం కాస్త అతిగానే క‌నిపిస్తోంది. ఈ మూవీలో దీపిక న‌టిస్తోంద‌న్న‌ది ఇప్పుడే తెలిసిన విష‌యం కాదు. ఇంత‌కుముందే ట్రైల‌ర్ లో ఛూఛాయ‌గా రివీల్ చేసారు. అదే వార్త‌ను ఇప్పుడు హైప్ చేయ‌డం వెన‌క లాజిక్ ఏంటో అర్థం కాదు. ఇక హిందీ మీడియా విశ్లేష‌ణ‌ల‌తో పోలిస్తే సౌత్ లో ఈ మూవీ పై విభిన్న‌మైన విశ్లేష‌ణ‌లు సాగాయి. అర్థం కాని క‌థ క‌థ‌నాల‌తో మూవీ తేలిపోయింద‌ని విజువ‌ల్ గ్రాఫిక్స్ మాయ‌లో ప‌డి ఆయాన్ ముఖ‌ర్జీ చాలా విష‌యాల‌ను మ‌ర్చిపోయాడ‌ని కూడా విమ‌ర్శ‌లొచ్చాయి. ఇలాంటి టాక్ న‌డుమ ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.

బ్రహ్మాస్త్ర ఓపెనింగ్ డే రూ.35 కోట్ల రేంజులో వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నాలు వెలువ‌రించాయి. ఇది హైప్ కాకుండా నిజం కావాల‌ని అంతా కోరుకుందాం. బాలీవుడ్ క‌రోనా త‌ర్వాత కోలుకోలేదు. వరుస ఫ్లాపుల‌తో అల్లాడింది. ఇలాంటి స‌మయంలో మంచి హిట్లు అవ‌స‌రం. వ‌రుస ప‌రాజ‌యాల నుంచి బ్ర‌హ్మాస్త్ర బ‌య‌ట‌ప‌డేస్తుందా లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతానికి ఈ మూవీ హిట్ కొట్టిందా లేదా? అన్న‌ది చ‌ర్చించ‌డం ముందస్తు అవుతుంద‌ని తెలుగు క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. పార్ట్ 1 క్లీన్ హిట్ కొడితేనే సీక్వెల్ కి ఆస్కారం ఉంటుంది. అది బాలీవుడ్ మీడియాల హైప్ తో ప‌నిలేని అంశంగా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News