మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ''బ్రహ్మాస్త్ర'' పార్ట్-1 రిలీజ్ కు రెడీ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో "బ్రహ్మస్త్రం" పేరుతో విడుదల కానుంది. రణ్ బీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - కింగ్ అక్కినేని నాగార్జున - మౌనీ రాయ్ లు కీలక పాత్రలు పోషించారు.
భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతికతో మూడు భాగాలుగా రూపొందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని ''బ్రహ్మాస్త్రం: మొదటి భాగం శివ'' అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 2022 సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
'బ్రహ్మాస్త్రం' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రధాన నటీనటుల ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ కు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ట్రైలర్ ను చిత్రబృందం లాంచ్ చేసింది. వివిధ అస్త్రాల విశిష్టతను తెలియజేసే కథాంశంతో.. అదిరిపోయే విజువల్స్ తో వచ్చిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
"నీరు, గాలి, నిప్పు.. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ అస్త్రాలన్నింటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది. ఆ బ్రహ్మాస్త్రం విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుని ఉందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతనే శివ" అంటూ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది.
ఇందులో నంది అస్త్రంగా నాగార్జునను చూపించగా.. అగ్ని అస్త్రంగా రణబీర్ కపూర్ కనిపించారు. అతని ప్రేయసిగా అలియా.. వారి గురువుగా అమితాబ్ ఆకట్టుకున్నారు. ఓ వైపు ప్రధాన జంట మధ్య ప్రేమను చూపిస్తూనే.. మరోవైపు దుష్టశక్తుల నుంచి బ్రహ్మాస్త్రాన్ని కాపాడేందుకు రణబీర్ - నాగ్ కలిసి చేసే పోరాటాన్ని చూపించారు. మౌనీ రాయ్ ఇక్కడ నెగెటివ్ రోల్ లో కనిపించింది.
రెండున్నర నిమిషాల ఈ ట్రైలర్ లో విజువల్స్ మరియు వీఎప్ఎక్స్ షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. హాలీవుడ్ సినిమాను తలపించేలా నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్ళాయి. అయితే నటీనటుల తెలుగు డబ్బింగ్ మాత్రం నిరాశ పరిచేలా ఉంది. మొత్తం మీద అయాన్ ముఖర్జీ ఒక విజువల్ వండర్ ని తెర మీద ఆవిష్కరించారని 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సౌత్ ఇండియాలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతో తెలుగులోనూ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Full View