పీవీపీ సినిమా.. టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా అతి తక్కువ కాలంలోనే ఎదిగిన బ్యానర్ ఇది. స్వతహాగా ఇండస్ట్రియలిస్ట్ అయిన ప్రసాద్ వి పొట్లూరి.. సినిమాలపై వల్లమాలిన ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తక్కువ సమయంలోనే ఎక్కువ చిత్రాలను తీసిన రికార్డును ఖాతాలో వేసుకున్నారు. అయితే.. ఈయన బ్యానర్ లో వచ్చిన సినిమాల్లో సక్సెస్ ల సంఖ్య కంటే ఫెయిల్యూర్స్ కౌంట్ చాలా ఎక్కువ.
ఈ ఏడాది వచ్చిన క్షణం - ఊపిరి మినహాయిస్తే.. వేరే ఏ సినిమాలు పీవీపీని నిర్మాతగా సంతృప్తి పరచలేదు. రీసెంట్ గా విడుదలైన మహేష్ బాబు మూవీ బ్రహ్మోత్సవం అయితే.. టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ సినిమా విషయంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల బిహేవియర్.. పీవీపీని బాగా హర్ట్ చేసిందనే టాక్ ఉంది. కాస్టింగ్ నుంచి షూటింగ్ లో మార్పుల వరకూ.. ఏ ఒక్క విషయాన్ని నిర్మాతతో డిస్కస్ చేయలేదని.. అంతా తానై వ్యవహరించడం, చెప్పాల్సి వస్తే హీరోతో మాత్రమే మాట్లాడేవాడట. పైగా చేతిలో పూర్తి స్క్రిప్ట్ లేకుండా.. షూటింగ్ కి దిగడంతో అనుకున్న సమయం కంటే సినిమా ఆలస్యమైపోయిందని తెలుస్తోంది.
అంతకు ముందు ఊపిరి విషయంలో వంశీ పైడిపల్లితోను ఇలాంటి అనుభవాలు పీవీపీకి చాలా ఉన్నాయంటున్నారు. ఆ మూవీ డీసెంట్ పిక్చర్ అనిపించుకున్నా.. నిర్మాతకు బ్రేక్ ఈవెన్ మాత్రం కాలేదు. ఇలాంటి దర్శకుల కారణంగానే నిర్మాణం నుంచి తప్పుకుని, ఫిలిం ఫైనాన్స్ కి పరిమితం కావాలని పీవీపీ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.