తన కొత్త సినిమా ‘బ్రహ్మోత్సవం’కు టాక్ ఎలా ఉన్నా సరే.. మహేష్ బాబు మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా చూపిస్తున్నాడు. ఆల్రెడీ బెంగళూరు బాక్సాఫీస్ లో నెంబర్ వన్ ప్లేసులో నిలవడమే కాదు.. యుఎస్ లో 1 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టింది బ్రహ్మోత్సవం. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఫస్ట్ డే షేర్ సాధించిన సినిమాగా బ్రహ్మోత్సవం రికార్డు సృష్టించింది.
మహేష్ బాబు లాస్ట్ బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు తూర్పు గోదావరిలో తొలి రోజు రూ.152 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా.. బ్రహ్మోత్సవం రూ.1.6 కోట్లు వసూలు చేయడం విశేషం. మహేష్ బాబుకు ఆల్రెడీ ఈ జిల్లాలో రెండు కోటి రూపాయల ఫస్ట్ డే షేర్ సాధించిన సినిమాలున్నాయి. 1 నేనొక్కడినే రూ.1.08 కోట్లు వసూలు చేయగా.. ఆగడు రూ.1.13 కోట్లు కలెక్ట్ చేసింది. ఇవి రెండూ కూడా డిజాస్టర్లే. ఇప్పుడు బ్రహ్మోత్సవం కూడా నెగెటివ్ టాక్ తోనే తొలి రోజు అంచనాల్ని మించి కలెక్షన్లు సాధించింది.
ఐతే తొలి రోజు చాలా వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి కాబట్టి బ్రహ్మోత్సవం బాగానే మేనేజ్ చేసి ఉండొచ్చు. ఐతే రెండో రోజు నుంచి కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. వీకెండ్ అయ్యాక పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. ఫుల్ రన్లో మాత్రం బ్రహ్మోత్సవం బయ్యర్లకు భారీ నష్టాలే మిగులుస్తుందని అంచనా వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఈ సినిమా 4.8 కోట్ల బిజినెస్ చేసింది.