బ్రహ్మోత్సవం: ఆడియో రిలీజ్‌ కాదిది

Update: 2016-05-07 15:29 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం చిత్రానికి ఫ్యాన్స్ వేడుకలు కొన్నాళ్ల క్రితమే మొదలైనా.. అడియో రిలీజ్ రోజున ఈ పండగ అధికారికంగా స్టార్ట్ అయినట్లు లెక్క పెట్టుకోవాలి. అయితే.. కార్యక్రమం ప్రారంభంలోనే నిర్మాత పీవీపీ ఓ డైలాగ్ పేల్చారు. అదేంటంటే.. ఇది ఆడియో రిలీజ్ ఫంక్షన్ కాదనేశారు పీవీపీ.

బ్రహ్మోత్సవానికి సంబంధించిన ప్రతీ ఈవెంట్ ను ఓ పండుగలా చేయాలని నిర్ణయించామని..అందుకే దీన్ని సంగీతోత్సవం అన్నారు పీవీపీ. నిజంగా స్టేజ్ డెకరేషన్ ను చూస్తే ఆ మాట కరెక్టే అనిపించక మానదు. లైటింగ్ - డెకరేషన్ ఇలా ప్రతీ విషయంలో స్టేజ్ ను చూస్తుంటే.. కలర్ఫుల్ గా బాగా ఆకట్టుకుంటుంది. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి సూపర్బ్ గా డిజైన్ చేశారు ఈ వేదికని. ఆయన తపన - ట్యాలెంట్ ప్రతీ అంగుళం కనపిస్తుంది.

అయితే.. ఇంత అందంగా డిజైన్ చేయడానికి బాగానే ఖర్చవుతుంది కదా. అదే విషయాన్ని కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న నవదీప్.. నిర్మాత పీవీపీని అడిగేశాడు. ఎంతయిందేంటి అంటూ డైరెక్ట్ గానే అడిగేశాడు నవదీప్. పీవీపీ ఏమన్నా తక్కువవాడా.. ఆ ఒక్కటీ అడక్కు తమ్ముడూ మాట దాడేశాడు ప్రొడ్యూసర్. అంతే లెండి.. ఈ మధ్య నిర్మాతలను కలెక్షన్స్ - ఖర్చు.. ఈ విషయాలు మాత్రం అడక్కూడదు అంటూ ఫినిషింగ్ ఇచ్చాడు నవదీప్. `
Tags:    

Similar News