నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జెర్సీ' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపించడం.. ఒరిజినల్ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీలో రీమేక్ చేయడం జరిగింది.
హిందీలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాను అల్లు అరవింద్.. దిల్ రాజు మరియు నాగ వంశీలు రీమేక్ చేసిన విషయం తెల్సిందే. ఈ ముగ్గురు టాలీవుడ్ బడా నిర్మాతలు ఒకే సినిమాను అక్కడ రీమేక్ చేయడం తో హిందీ ప్రేక్షకుల్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నారు.
ఈ సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. కాని కరోనా వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల కాబోతుంది అంటూ ఏప్రిల్ 14వ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 14వ తారీకు విడుదల అవుతుంది అంటూ ప్రచారం కూడా మొదలు అయ్యింది. కాని చివరి నిమిషంలో సినిమా ను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
కేజీఎఫ్ 2 సినిమా విడుదల ఉండటం తో పాటు ఇంకా కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా షాకింగ్ విషయాన్ని చల్లగా చెప్పారు. షాహిద్ కపూర్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగు నిర్మాతలు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఇలా వాయిదాల మీద వాయిదాలు పడటం పట్ల తెలుగు ప్రేక్షకులు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
హిందీ జెర్సీ సినిమాను మరీ ఆలస్యం చేయకుండా ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. కొత్త విడుదల తేదీని ఏప్రిల్ 22కి ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. షాహిద్ కపూర్ గత చిత్రం కబీర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
అది అర్జున్ రెడ్డికి రీమేక్ అనే విషయం తెల్సిందే. కనుక సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారట. కాస్త ఆలస్యం అయినా కూడా జెర్సీ సినిమా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.