హిట్ సినిమాలకు సీక్వెల్స్ ట్రెండ్ అనేది బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉంది. 10-20 ఏళ్ల క్రితం హిట్ అయిన కథల్ని సైతం మళ్లీ తవ్వి తీయడం అక్కడో కల్చర్ గా ఉంది. వాటికి కొనసాగింపు కథైనా? ఆ టైటిల్ తో వచ్చే ప్రెష్ కంటెంట్ అయినా? దాన్ని సీక్వెల్ పేరుతో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకోవడం అన్నది బాలీవుడ్ కే చెల్లింది.
అక్కడ సీక్వెల్స్ కి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాదిన వర్కౌట్ అయినంతగా ఏ భాషలోనూ సీక్వెల్స్ సక్సెస్ అయిన దాఖలాలు లేవు. వాస్తవానికి ఇతర భాషల్లో సీక్వెల్స్ కూడా చాలా తక్కువనే చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ట్రెండ్ మారింది. కంటెంట్ పరంగా సౌంత్ ఇండస్ర్టీ ఆడియన్స్ అభిరుచిలో చాలా మార్పులొచ్చాయి.
రొటీన్ కథల్ని అంత ఈజీగా యాక్సప్ట్ చేయడం లేదు. సినిమాలో యూనిక్ ఏముందని ఆలోచించే స్థాయిలో పరిశ్రమ సహా ఆడియన్స్ పరిణితి చెందారు. `ఖైదీ`...`విక్రమ్`..`కేజీఎఫ్` లాంటి సినిమాల సక్సెస్ ని అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కొత్త కథలతో రిస్క్ చేయడం కన్నా సీక్వెల్స్ తో సేఫ్ జోన్ లో ఉండటమే ఉత్తమం అని కొంత మంది మేకర్స్ బలంగా విశ్వసిస్తున్నారు.
ప్రస్తుతం శంకర్ `భారతీయుడు` కి సీక్వెల్ గా `ఇండియన్ -2` తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే మరో కోలీవుడ్ సంచలనం లోకేష్ కనగరాజ్ `విక్రమ్-2`..`ఖైదీ-2` చిత్రాలు తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. అవి సీక్వెల్ అయినా కావొచ్చు.. కొనసాగింపు కథలుగానైనా ప్రేక్షకుల ముందుకు రావొచ్చు.
అలాగే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియన్ సెల్వన్` రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొస్తుంది. చోళ్ల సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా `ఆయిరత్తుల్ ఒరువన్ -2` తెరకెక్కుతోంది. మరోవైపు వాసు దర్శకత్వంలో `చంద్రముఖి-2` తెరకెక్కుతుంది.
మోహన్ రాజా దర్శకత్వంలో `తని ఒరువన్-2` జయం రవితోనే ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈరెండు సీక్వెల్స్ సెట్స్ పైకి వెళ్లనున్నాయి. అలాగే సూర్య-హరి కాంబినేషన్ లో `సింగం-4` కి రంగం సిద్దమవుతోంది. ఇక తెలుగులో `కార్తీకేయ`కి సీక్వెల్ గా `కార్తీకేయ-2` త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. `కేజీఎఫ్` నుంచి చాప్టర్-3 కూడా వస్తుంది. ఇక `బాహుబలి` రెండు భాగాలుతో రాజమౌళి ఇండియాన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే.