అందుకే ఇండియాకు రాను: పవర్ స్టార్ హీరోయిన్

Update: 2021-04-30 11:39 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పులి(కొమరం పులి) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది బ్రిటిష్ బ్యూటీ నికిషా పటేల్. ఈ వయ్యారికి తెలుగు సినిమాతో తన ఫిల్మ్ కెరీర్ ప్రారంభించింది. కానీ ఫస్ట్ మూవీ పెద్దగా ఫేమ్ తేకపోవడంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. మొత్తానికి తెలుగు తమిళ కన్నడ మలయాళం భాషల్లో కలిపి దాదాపు 30 సినిమాలకు పైగా నటించింది. అలాగే పలు సినిమాలు ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయట. నికిషా ప్రస్తుతం ఆమె పేరెంట్స్ తో లండన్ లో ఉంటుంది. ఇండియాలో గతేడాది కరోనా లాక్డౌన్ మొదలవక ముందే నికిషా లండన్ కు వెళ్ళిపోయింది. అక్కడే పలు కమర్షియల్ యాడ్స్ చేసుకుంటూ బిజీగా ఉంటుందట.

అయితే తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నికిషా ఇప్పట్లో ఇండియాకు రానని తేల్చి చెప్పేసిందట. ఎందుకంటే ఇండియాలో కరోనా పరిస్థితి రోజురోజుకి భయంకరంగా మారుతుండటంతో ఆమె రానని చెప్పింది. అలాగే ప్రస్తుతం ఇండియాలో నికిషా ఫినిష్ చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయని అవన్నీ ఫినిష్ చేయడానికి కరోనా ప్రభావం తగ్గిన వెంటనే వస్తానని చెప్పుకొచ్చింది. నికిషా కెరీర్ ప్రారంభించి పదేళ్లు దాటినా ఇంతవరకు ఏ భాషలో కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. అలాగే నేను ఇండియాకు ఇప్పట్లో రానంటే కొందరు సోమరి, అంకితభావం లేదని కామెంట్ చేసారు. పర్లేదు అనుకోండి. ఎవరేమనుకున్నా ముందు ఆరోగ్యంగా ఉండటానికే ఇంపార్టెన్స్ ఇస్తానని చెబుతోంది. అయితే చివరిగా అమ్మడు నా ఫస్ట్ హోమ్ ఇండియానే అని చెప్పింది. అలాగే ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో పేరెంట్స్ తో వన్ ఇయర్ స్పెండ్ చేసానని చెబుతోంది. చూడాలి మరి త్వరలో ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందో..!
Tags:    

Similar News