ఇరుగు పొరుగు భాషల్లో బ్లాక్ బస్టర్లు కొట్టిన సినిమాల రీమేక్ హక్కుల్ని ఛేజిక్కించుకోవడం తెలుగులో బ్లాక్ బస్టర్లు కొట్టడం డి.సురేష్ బాబుకి వెన్నతో పెట్టిన విద్య. నిరంతరం వెంకీ కోసం రానా కోసం అలాంటి రీమేక్ కథలను ఆయన వెతుకుతుంటారు. అందులో చాలా ఇప్పటికే వర్కవుటయ్యాయి. వెంకీ నటించిన దృశ్యం ఫ్రాంఛైజీ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. చాలా కాలంగా వెంకీ - రానా ఇద్దరికీ సూటయ్యే రీమేక్ కథను వెతుకుతున్నారు డి.సురేష్ బాబు. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయబడే వెబ్ సిరీస్ ను వారి కోసం సెట్ చేసాడు. ఇదిగో తదుపరిది.
సురేష్ బాబు ఇటీవల విడుదలైన మలయాళ హాస్య చిత్రం `బ్రో డాడీ`ని కోర్కి ఇష్టపడినట్లు నివేదికలు వస్తున్నాయి. వెంకీ -రానాలను కలిపి తీయటానికి కుదిరే స్క్రిప్ట్ ఇది. మోహన్ లాల్ -పృథ్వీరాజ్ ల తండ్రి - కొడుకుల పాత్రలు సరిగ్గా సరిపోతాయని అతను భావిస్తున్నాడు.
బ్రో-డాడీ అనేది రెండు కుటుంబాల నడుమ సాగే సరిగమల కథ. చక్కని కామెడీ మూవీ ఇది. వారి పిల్లలు పృథ్వీరాజ్ - కళ్యాణి ప్రియదర్శన్.. ప్రేమలో పడినప్పుడు.. పెళ్లికి ముందే అమ్మాయి గర్భవతి అయితే.. ఆ తర్వాత ఆ లైఫ్ లో ఏం జరిగింది? అన్నది తెరపై ఆవిష్కరిస్తున్నారు. కాన్సెప్ట్ ఉన్న చక్కని చిత్రమిది. ఖచ్చితంగా వెంకీతో పాటు రానాకు వర్కవుటవుతుందని సురేష్ బాబు భావిస్తున్నారు. మరోవైపు పృథ్వీరాజ్ నుండి `బ్రో డాడీ` హక్కులకు బోలెడంత పోటీనెలకొంది. పృథ్వీరాజ్ తెరకెక్కించిన లూసీఫర్ రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం నుంచి చాలా సినిమాలు తెలుగులోకి అనువాదమవుతున్నాయి.