బ్రూస్ లీ లోఅదే హైలైట్

Update: 2015-09-30 13:30 GMT
చాలా కాన్ఫిడెంటుగా దసరా రేసులోకి దూకేస్తున్నాడు రామ్ చరణ్. శ్రీను వైట్ల దర్శకత్వంలో అతను నటించిన ‘బ్రూస్ లీ’ ఇంకో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. సినిమాలో హైలైట్లకు కొదవే లేదు. చరణ్ - శ్రీను వైట్ల కాంబినేషనే సినిమాకు పెద్ద హైలైట్. చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మూడు నిమిషాల క్యామియో రోల్ తో సందడి చేయబోతున్నాడు. ఆ మూడు నిమిషాలు థియేటర్లు ఏ స్థాయిలో హోరెత్తిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరు పాత్ర ప్రి క్లైమాక్స్ లో తెరమీదికి వస్తుందని సమాచారం.

ఐతే ప్రథమార్ధానికి ఇంకో పెద్ద హైలైట్ ఉందట. ఇంటర్వెల్ కు ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజిలో ఉంటుందని.. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా మైండ్ బ్లోయింగ్ అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఫారిన్ లో తెరకెక్కించిన ఈ సన్నివేశాలు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయని అంటున్నారు. ‘బ్రూస్ లీ’ ప్రమోషన్స్ చాలా అగ్రెసివ్ గా ఉండటాన్ని బట్టే సినిమా మీద వైట్ల అండ్ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న విషయం అర్థమవుతోంది. రెండు రోజుల కిందటే చిరంజీవి రంగంలోకి దిగాడు. ఈ రోజుతో ఆయనకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ పూర్తవుతుంది. ఈ శుక్రవారమే ‘బ్రూస్ లీ’ ఆడియో ఫంక్షన్ జరగబోతోంది. ఆ తర్వాత ప్రమోషన్స్ మరింత గట్టిగా చేసి.. 16న బ్యాంగ్ బ్యాంగ్ అనిపించేలా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

Tags:    

Similar News