మొత్తానికి రాత్రి 12 గంటలకు శ్రీను వైట్ల బర్తడే సందర్భంగా ఒక వీడియోను రిలీజ్ చేస్తాం అని చెప్పిన ''బ్రూస్ లీ'' టీమ్.. చివరకు తెల్లవారుజామున 3.30కి ఆ పాటను విడుదల చేశారు. 'లే ఛలో' పేరుతో సాగే ఆ మెలోడీని.. ఒక నిమిషం నిడివి ఉన్న వీడియో సాంగ్ రూపంలో రిలీజ్ చేశారు. పదండి ఎలా ఉందో చూద్దాం.
నిజానికి ఈ పాట ట్యూన్ థమన్ బాగానే కంపోజ్ చేశాడు. చాలా రోజుల తరువాత మాంచి హమ్మింగ్ కు స్కోప్ ఉన్న పాటను అందించాడు మనోడు. అయితే ఈ పాటలో రామ్ చరణ్ గ్రేస్ తో వేసిన స్టెప్పులు, మనోడు స్టయిలింగ్ అదిరిపోయాయ్. ఇకపోతే మనం ఎప్పటినుండో చెబుతున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ కూడా పాటలో బాగా డామినేట్ చేసేసింది. అమ్మడు చిట్టి పొట్టి వస్త్రాల్లో వయ్యారి ఒంపులను వడ్డిస్తూ హీట్ పెంచేసింది. బహుశా వర్షా కాలం పోయి వింటర్ రాబోతుంది కదా.. అందుకే ఈ హాట్ సెగలేమో.
ఇకపోతే పాటలో చెర్రీ-రకుల్ కెమెస్ర్టీ బాగుంది. ఎప్పుడో గతంలో ఢీ సినిమాలో విష్ణు-జెనీలియాపై మనోడు ఇలాంటి హాట్ పాటను ఒకటి షూట్ చేశాడు. ఆ తరువాత అంతటి కైపిక్కించే శృంగారభరితమైన పాట ఇదేనయ్యా శ్రీను వైట్ల. ఎనీవే.. హ్యాపీ బర్తడే.