కల్యాణ్ దేవ్ తో 'ఉప్పెన' డైరెక్టర్?

Update: 2021-05-19 17:30 GMT
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ .. 'విజేత' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఆ సినిమా కథాకథనాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ కుర్రాడి కటౌట్ బాగుంది .. కంటెంట్ ఉన్నవాడేనని ప్రేక్షకులు అనుకున్నారు. ఆ తరువాత నటన విషయంలో మరింతగా మెరుగులు దిద్దుకుని, 'సూపర్ మచ్చి' సినిమాతో రంగంలోకి దిగాడు. ఇక ఈ సినిమా విడుదలకి సరైన సమయం చూస్తుండగానే కరోనా కారణంగా గ్యాప్ పెరిగిపోతూ వచ్చింది. ఈ లోగానే కల్యాణ్ దేవ్ .. 'కిన్నెరసాని' అనే ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.

'కిన్నెరసాని' సినిమాకి రమణతేజ దర్శకత్వం వహిస్తున్నాడు. 'అశ్వద్ధామ' త్తరువాత రమణతేజ చేస్తున్న సినిమా ఇది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కల్యాణ్ దేవ్ .. 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో సినిమా చేయనున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. అందుకు సంబంధించిన మాటలు నడుస్తున్నాయని అంటున్నారు.

బుచ్చిబాబు ఇటీవల తెరకెక్కించిన 'ఉప్పెన' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ ప్రేమకథా చిత్రం యూత్ నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ ను రాబట్టింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. ఒకే ఒక్క సినిమాతో వైష్ణవ్ తేజ్ కి మంచి గుర్తింపు వచ్చేసింది. దాంతో ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో చేయడానికి కల్యాణ్ దేవ్ ఉత్సాహపడుతున్నాడని అంటున్నారు. మెగా ఫ్యామిలీతో బుచ్చిబాబుకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది కనుక, ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే చెప్పుకుంటున్నారు.       
Tags:    

Similar News