టెన్షన్ టెన్షన్! సల్మాన్ కి బుల్లెట్ ప్రూఫ్ కార్! అసలేం జరుగుతోంది!?
అసలు సల్మాన్ ఖాన్ చుట్టూ ఏం జరుగుతోంది? ఓవైపు సల్మాన్ ఇంటి పరిసరాల్లో పోలీసుల వలయంతో పాటు అతడు ఎక్కడికి వెళుతున్నా పరిసరాల్లో సెక్యూరిటీ హై ఎలెర్ట్ తో పని చేయడం నిజమైన సినిమానే తలపిస్తోంది. ఇంతకుముందే గన్ లైసెన్స్ కి దరఖాస్తు చేసుకున్న సల్మాన్ ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్ తో ఆరుబయట కనిపించాడు.
ఈ కార్ వెళ రూ.1.50 కోట్లు. అయితే సల్మాన్ ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి కారణాలు స్పష్టంగా ఉన్నాయి. ఇటీవల హత్య బెదిరింపులు ఖాన్ కుటుంబానికి చాలా భయాన్ని కలిగించాయి. సల్మాన్ ఖాన్ తొలిగా తన ఆయుధ లైసెన్స్ పొందాడు. లారెన్స్ బిష్ణోయ్ అతని ముఠా నుండి సల్మాన్ కుటుంబానికి హత్యా బెదిరింపులు రావడంతో సహాయం కోసం ముంబై పోలీసులను ఆశ్రయించారు. అదే క్రమంలో తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసాడు. ఇప్పుడిలా ఖరీదైన కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసాడు.
సల్మాన్ ఖాన్ ఇటీవల విమానాశ్రయానికి వెళ్లే క్రమంలో కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారులో కనిపించారు. కారు ధర రూ. 1.50 కోట్లు. పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కార్.. హై ఎండ్ ఫీచర్స్ తో ఉందీ కార్.
వాస్తవానికి ఈ కారు విశ్వసనీయతలో ప్రత్యేక స్టాంప్ తో కస్టమర్ కి అందుతుందని కూడా తెలిసింది. ఇది టయోటా బ్రాండ్ లో ఇప్పటికే ప్రూవ్ చేసిన బుల్లెట్ ప్రూఫ్ విశ్వసనీయత రికార్డును కలిగి ఉంది. ప్రస్తుత సూపర్ స్టార్ సల్మాన్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్త కార్ అందరి దృష్టిని ఆకర్షించింది. సల్మాన్ అతనితో పాటు భద్రతా సిబ్బంది ఉన్నారు.
సల్మాన్ ఖాన్ తన తుపాకీ లైసెన్స్ కోసం ముంబై పోలీస్ కమీషనర్ కార్యాలయాన్ని సందర్శించిన విషయం తెలిసినదే. తుది లైసెన్స్ పొందే ముందు దరఖాస్తుదారు భౌతికంగా కనిపించడం చాలా ముఖ్యం. దానిని బాలీవుడ్ సూపర్ స్టార్ ఆనందంగా అంగీకరించారు. జాగింగ్ సెషన్ లో తన తండ్రి సలీం ఖాన్ కు హత్య బెదిరింపు రావడంతో సల్మాన్ ఖాన్ ఆయుధాల లైసెన్స్ కోసం అభ్యర్థించాడు.
ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ అతని ముఠా సభ్యులలో కొంతమందిని అరెస్టు చేయగా.. సల్మాన్ ఖాన్ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని పుకార్లు వ్యాపించాయి. అయితే సల్మాన్ తండ్రి సలీం ఖాన్ జాగింగ్ చేస్తున్నప్పుడు పార్క్ లో హత్యా బెదిరింపు లేఖ లభించింది. సలీమ్ జీ సాధారణంగా విశ్రాంతి తీసుకోవడానికి ఆ బెంచ్ పై కూర్చుంటాడు. ఈ లేఖపై ఎలాంటి సంతకం కనిపించలేదు. కానీ అప్పటి పరిస్థితిలో ఆ లేఖ సారాంశంపై చర్చ సాగింది. సల్మాన్ ని కూడా మూసేవాలాగా హతమారుస్తామని ఆ లేఖలో రాసి ఉంది. ఇది ఖాన్ కుటుంబాన్ని షాక్ కు గురి చేసింది.