ప్రతీ సీజన్ కు ఓ బ్లాక్ బస్టర్ సాంగ్ పాపులర్ అవుతూ వుంటుంది. అదే వైరల్ గా మారి సాంగ్ ఆఫ్ ది సీజన్ గా నిలుస్తూ వుంటుంది. తాజాగా ఈ సీజన్ కి బ్లాక్ బస్టర్ సాంగ్ ఆఫ్ ది సీజన్ గా ఓ పాట నిలవబోతోంది. వివరాల్లోకి వెళితే.. ఉస్తాద్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ `ది వారియర్`. రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రమిది. రన్, పందెం కోడి, ఆవారా చిత్రా దర్శకుడు ఎన్ .లింగుస్వామి చాలా రోజుల తరువాత చేస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది.
హీరో ఉస్తాద్ రామ్ తన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. హీరో రామ్, దర్శకుడు ఎన్. లింగుస్వామి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నఈ మూవీ ఇప్పటికే ట్రేడ్ సర్కిల్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. రామ్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి యువ సంగీత సంచలనం దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే నాలుగు పాటలని విడుదల చేశారు. ఫస్ట్ సింగిల్ గా విడుదలైన `బుల్లెట్..` సాంగ్ ఇప్పటికీ నెట్టింట సందడి చేస్తూ వైరల్ అవుతోంది. కోలీవుడ్ లోనూ ఈ పాట `ది వారియర్` మూవీకి ప్రధాన ఎస్సెట్ గా మారి సినిమాని అక్కడ కూడా వైరల్ అయ్యేలా చేసింది.
ఇప్పటికి నాలుగు లిరికల్ వీడియోలని ఈ మూవీ నుంచి విడుదల చేసినా `బుల్లెట్..` సాంగ్ రికార్డ్ స్థాయి వ్యూస్ ని రాబడుతూ వైరల్ గా మారుతోంది. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ పాట 87 మిలియన్స్ వ్యూస్ ని క్రాస్ చేసి వంద మిలియన్ వ్యూస్ ని అధిగమించే విధంగా దూసుకుపోతోంది.
ఈ మధ్య కాలంలో ఇంతగా వైరల్ అయిన సాంగ్ ఇదే కావడంతో ఈ పాట బ్లాక్ బస్టర్ సాంగ్ ఆఫ్ ది సీజన్ గా అభివర్ణిస్తున్నారు. దేవిశ్రీ అందించిన మ్యాజికల్ మ్యూజిక్, శ్రీమణి సాహిత్యం, హీరో శింబు తో కలిసి హరిప్రియ ఆలపించి తీరు ఈ పాటని ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి.
డాన్స్ మాస్టర్ శేఖర్ వీజే కంపోజ్ చేసిన ఈ పాటలో హీరో రామ్, హీరోయిన్ కృతిశెట్టి వేసిన స్టెప్స్ మరింత ఆకర్షణగా నిలిచి ఈ పాటకు రికార్డు స్థాయి వ్యూస్ వచ్చేలా చేశాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ రామ్ కెరీర్ కి క్రూషియల్. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జూలై 14న మరో మూడు రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అవుతుందా.. బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ కోరిక నెరవేస్తుందా? అన్నది తెలియాలంటే ఈ గురువారం వరకు వేచి చూడాల్సిందే.
Full View