అతి వేగంతో రోడ్డుప్రమాదానికి గురైన మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందన్న ప్రశ్నకు తాజాగా అధికారిక సమాచారం వెల్లడైంది. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల వేళలో.. రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన వెంటనే.. సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లటం మెగా అభిమానుల్ని కలవరపెట్టింది. టెన్షన్ కు గురి చేసింది. తొలుత మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స చేసిన ఆయన్ను.. తర్వాత మెరుగైన వైద్యం కోసం అపోలోకు షిప్టు చేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపైఅపోలో ఆసుపత్రి మీడియాకు ఒక బులిటెన్ ను విడుదల చేసింది.
తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో కాలర్ బోన్ విరిగిందని.. అది పెద్ద సమస్య కాదని వైద్యులు పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. శనివారం ఉదయానికి తేజ్ మాట్లాడతారని.. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తేజ్ తప్పనిసరిగా కోలుకుంటాడని.. ఎవరూ టెన్షన్ పడొద్దని అపోలో వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
తేజ్ కుటుంబ సభ్యులంతా అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికి.. 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని చెప్పారు. ఆయన త్వరగానే రికవరీ అవుతారన్న మాట వినిపిస్తోంది. శుక్రవారంఅర్థరాత్రి దాటిన తర్వాత సాయి ధరమ్ తేజ్ స్ప్రహలోకి వచ్చారని.. మాట్లాడినట్లుగా చెబుతున్నారు. అయితే.. అధికారికంగా మాత్రం ఈ సమాచారన్నిఎవరూ వెల్లడించటం లేదు.