బన్నీ బాగానే రీసెర్చ్‌ చేశాడండీ!!

Update: 2015-10-07 16:44 GMT
రుద్ర‌మ‌దేవి 3డిలో బ‌న్ని గోన‌గ‌న్నారెడ్డి పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. గోన‌గ‌న్నారెడ్డి క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది? అన్న‌ది మ‌నం పోస్ట‌ర్లు చూసి  ఇలాగే ఉంటాడేమో అనుకున్నాం. వాస్త‌వానికి అదంతా ఫిక్స‌న‌ల్‌, ఇమేజినేష‌న్ రూపం మాత్ర‌మే అది. ఈ సీక్రెట్‌ని బన్ని స్వ‌యంగా రివీల్ చేశాడు.

అస‌లు కాక‌తీయుల చ‌రిత్ర‌కు సంబంధించి దొరికిన ఆధారాలు చాలా త‌క్కువ‌. అస‌లు గోన‌గ‌న్నారెడ్డి ఇలానే ఉంటాడు అన్న‌ది మా ఊహ మాత్ర‌మే. ముఖ్యంగా నా ఇంట‌ర్‌ప్రెటేష‌న్‌. ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌తో క‌లిసి చ‌ర్చించి ఇలా ఉంటే బావుంటుంది అని అనుకున్నాం. అలా పుట్టుకొచ్చిన రూపం అది. అస‌లు బంధిపోటు అంటే కాస్త న‌ల్ల‌ని డ్రెస్, పేలిక‌లు, చీలిక‌లు ఉన్న డ్రెస్‌.. భీక‌ర రూపం ఉండాల‌నుకున్నాం. భాష‌, యాస ఎలా ఉండాలి ఆలోచించిన‌ప్పుడు .. గోన‌గ‌న్నారెడ్డి మెజారిటీ భాగం తెలంగాణ ప్రాంతంలోనే సంచ‌రించాడు. పాల‌మూరు ప‌రిస‌రాల్లోనూ తిరిగాడు. అందుకే తెలంగాణ యాక్సెంట్ మాట్లాడుతుంది ఆ క్యారెక్ట‌ర్‌.

అయితే అంద‌రికీ అర్థం అవ్వాలి కాబ‌ట్టి మెజారిటీ భాగం సినిమా యూనివ‌ర్శ‌ల్ లాంగ్వేజ్‌లోనే మాట్లాడాను అని అన్నారు. అలాగే తెలంగాణ యాక్సెంటులో పూర్తి స్తాయిలో మాట్లాడిన మొద‌టి హీరోని నేనేనేమో అని అన్నారు.  రుద్ర‌మ‌దేవి క‌థ‌కు చారిత్ర‌క ఆధారాలు చాలా త‌క్కువ‌గా దొరికాయి. అయినా ఎంతో ప్యాష‌న్‌తో గుణ‌శేఖ‌ర్ క‌థ‌పై రీసెర్చ్ చేసి ఈ సినిమా తెర‌కెక్కించార‌ని బ‌న్ని అన్నారు.  గుణశేఖరుడు కథపై రీసెర్చి ఏమో కాని.. బన్నీ మాత్రం గోన గన్నారెడ్డిపై మాంచి రీసెర్చే చేశాడు.
Tags:    

Similar News