ఈ అభిమానులున్నారే వారి మనోభావాలు సున్నితంగా ఉంటాయి. ఎంత సున్నితంగా అంటే ఏదైనా కొంచెం తేడాకొడితే చాలు సోషల్ మీడియాలో విరుచుకు పడతారు. కొద్ది రోజుల క్రితం యూవీ క్రియేషన్స్ వారు ధనుష్ పోస్టర్ రిలీజ్ చేస్తే డార్లింగ్ ప్రభాస్ అభిమానులు 'మా అన్న సినిమా సంగతి ముందు తేల్చండి' అంటూ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. తాజగా అల్లు అర్జున్ అభిమానులు ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్స్ట్ ను తిట్టిపోస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే 'అల వైకుంఠపురములో' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సన్ నెక్స్ట్ వారు సొంతం చేసుకున్నారు. ఫిబ్రవరి 26 నుంచి స్ట్రీమింగ్ ఉంటుందని ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం పట్టలేకపోయారు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తమ ఫేవరెట్ హీరో సినిమాను చూడవచ్చని ఆశపడ్డారు. చాలామంది ఫ్యాన్స్ సన్ నెక్స్ట్ సబ్ స్క్రిప్షన్ కూడా తీసుకున్నారట. అయితే సన్ నెక్స్ట్ వారు 'అల వైకుంఠపురములో' ప్రీమియర్ ను వాయిదా వేస్తున్నామని చావుకబురు చల్లగా చెప్పారు. దీంతో ఫ్యాన్స్ కు మండిపోయింది. కొందరేమో చీటింగ్ అని నింద వేస్తే కొందరు సన్ నెక్స్ట్ యాప్ కు 1 రేటింగ్ ఇస్తామని బెదిరించారు.
సంక్రాంతికి రిలీజ్ అయిన 'అల వైకుంఠపురములో' బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా ఇప్పటికీ ఇంకా కొన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఉంది. నిన్న బుట్టబొమ్మ సాంగ్ రిలీజ్ చేస్తే భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి ఇలాంటి సినిమాను రిపీట్ మోడ్ లో చూడాలని ఆశపెట్టుకున్న అభిమానులను నిరాశపరిస్తే మనోభావాలు దెబ్బతినకుండా ఎలా ఉంటాయి?