బన్నీ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ `పుష్ప ది రైజ్`. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం పార్ట్ 1 గా ప్రేక్షకుల ముందుకు ఈ నెల 17న వరల్డ్ వైడ్‌గా రానున్న విషయం తెలిసిందే. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో బన్నీ ఈ చిత్ర ప్రమోషన్ లో పాల్గొంటూ గత కొన్ని రోజులుగా బిజీ బిజీగా గడిపేస్తున్నారు. తాజాగా మీడియాతో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయిన బన్నీ `పుష్ప` సినిమాపై మీడియా వ్యక్తుల ఫీడ్ బ్యాక్ ని అడగడం ఆసక్తికరంగా మారింది.
వ్యక్తిగతంగా కానీ వీడియో రూపంలో కానీ తమ ఫీడ్ బ్యాక్ ని తెలియజేయాలని.. సినిమా నచ్చితే ఎందుకు నచ్చింది.. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు.. సినిమాలో ఏ అంశం బాగా నచ్చింది. పాయింట్ టు పాయింట్ తనకు తెలియజేయాలని ప్రత్యేకంగా మీడియా వారిని బన్నీ అడగడం ప్రాధాన్యతని సంతరించుకుంది. గతంలో తన ఏ చిత్రానికి ఫీడ్‌బ్యాక్ ఇవ్వమని ఎవరినీ అడగని బన్నీ కొత్తగా `పుష్ప` విషయంలో ఇలా మీడియా వ్యక్తుల్ని ఫీడ్ బ్యాక్ అడగడం పలువురిని ఆశ్చర్యానికి లోను చేస్తోంది.
అంతే కాకుండా సినిమా ఎందుకు కనెక్ట్ అయిందో ఏ అంశం నచ్చిందో జెన్యూన్ గా తెలపమని, అంతే కాకుండా మీరు చేసే విమర్శలు చాలా కన్స్ట్రక్టీవ్ గా వుండాలని వాటిని తాను చాలా పాజిటీవ్ వేలో తీసుకుంటానని బన్నీ స్పష్టం చేశారట. ఆఫ్ ద రికార్డ్ మీడియా వ్యక్తులతో మాట్లాడిన బన్నీ మీరు అందించే ఫీడ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తుంటానని చెప్పడం గమనార్హం. ఫీడ్‌బ్యాక్ ని తన టీమ్ కి పంపించాలని ఈ సందర్భంగా మీడియా వారిని కోరిన బన్నీ ఈ సినిమా కోసం చాలా హర్డ్‌వర్క్ చేశానని, ఫారెస్ట్ ఏరియాలో చిత్రీకరణ చేస్తున్న సందర్భంగా చాలా విషయాలు నేర్చుకున్నానని, ఇంత వరకు ఏ పాత్రకు ప్రిపేర్ కానంతగా ఈ పాత్ర కోసం ప్రిపేర్ అయ్యాననని పేర్కొన్నారట.
మేకప్ కోసమే రెండు గంటల 50 నిమిషాలు పట్టేదని, ఆ తరువాత సెట్ లో షూట్ ప్రారంభానికి మరో అరగంట పట్టేదని బన్నీ ఈ సందర్భంగా తెలిపాడట. గతంలో తాను ఏ చిత్రానికి ఈ స్థాయిలో మేకప్ కోసం టైమ్ తీసుకోలేదని, తొలిసారి ప్రోస్తెటిక్ మేకప్ కావడంతో `పుష్ప` కోసం చాలా టైమ్ తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడట. బన్నీ మాటలని బట్టి చూస్తుంటే ఈ సినిమాపై చాలా ఎఫర్ట్ పెట్టినట్టుగా తెలుస్తోందని, అందుకే ఎన్నిడూ ఏ సినిమా ఫీడ్ బ్యాక్ చెప్పని అడగని బన్నీ `పుష్ప` విషయంలో మాత్రం మరీ మరీ ఫీడ్ బ్యాక్ చెప్పమని క్రిటిక్స్ ని , మీడియా వారిని అడుగుతున్నాడని మీడియా వర్గాల్లో చర్చ మొదలైంది.