అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ ను దక్కించుకునేందుకు సిద్దం అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ కథ నేపథ్యంలో రూపొందుతున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది. పుష్ప కు పాన్ ఇండియా టచ్ ఇచ్చేందుకు గాను పలు భాషలకు చెందిన స్టార్స్ ను ఈ సినిమాలో నటింపజేస్తున్నారు. బన్నీ గత చిత్రాలు ఉత్తరాదిన యూట్యూబ్ మరియు శాటిలైట్ ద్వారా ఆకట్టుకున్నాయి. కనుక పుష్ప సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
పుష్ప సినిమాను మొదట పాన్ ఇండియా సినిమాగా అనుకోలేదట. కాని అల వైకుంఠపురంలో సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఈమద్య కాలంలో మన సినిమాలకు ఇతర భాషల్లో దక్కుతున్న ఆధరణ కారణంగా పుష్ప కు పాన్ ఇండియా మెరుగులు దిద్దుతున్నారు. అయితే కథ విషయంలో మాత్రం కాస్త అనుమానం వ్యక్తం అవుతోందని అంటున్నారు. ఈ సబ్జెక్ట్ యూనివర్శిల్ సబ్జెక్ట్ కాకపోవచ్చు అంటున్నారు. పుష్ప కథ ఎలా ఉన్నా టేకింగ్ బాగుంటే పాన్ ఇండియా రేంజ్ మూవీ అవుతుందని కొందరు నమ్ముతున్నారు. పుష్ప తర్వాత బన్నీ అసలు సిసలు పాన్ ఇండియా మూవీని చేస్తాడంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
పుష్ప సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉన్నా కూడా అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దాంతో బన్నీ గత కొన్నాళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్న ఐకాన్ ను మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఐకాన్ సినిమా ను దిల్ రాజు నిర్మిస్తుండగా వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కథ కు బన్నీ ఓకే చెప్పాడు కాని కొన్ని కారణాల వల్ల వాయిదాలు వేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది యూనివర్శిల్ సబ్జెట్ కావడంతో పాటు పాన్ ఇండియా మూవీ గా మొదటి నుండే పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారట. కనుక పుష్ప సినిమా ఎలా ఉన్నా ఐకాన్ తో బన్నీ ఖచ్చితంగా పాన్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.