బన్నీ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు 'పుష్ప' సినిమా కోసమే ఎంతో ఇంట్రెస్టింగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. గతంలో సుకుమార్ - బన్నీ కాంబినేషన్లో 'ఆర్య' .. 'ఆర్య 2' వంటి హిట్లు వచ్చిన కారణంగా కూడా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు జోరుగా జరుగుతోంది. బన్నీ కాంబినేషన్లోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రతి సన్నివేశం .. ప్రతి మలుపు ప్రేక్షకుల ఊహకు అందని విధంగా సుకుమార్ ప్లాన్ చేశాడని చెబుతున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ వారు దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అందుకు తగినట్టుగానే ముఖ్యమైన పాత్రలకిగాను వివిధ భాషలకు చెందిన ఆర్టిస్టులను తీసుకుంటున్నారు. ఈ సినిమాకి కథ నుంచి దర్శకత్వం వరకూ సుకుమార్ అన్నీ తానై చూసుకుంటున్నాడు. పైగా పాన్ ఇండియా సినిమాకు ఎక్కువ కాలం కేటాయించవలసి వస్తుంది గనుక, ఈ సినిమా కోసం ఆయన 20 కోట్లకి పైగా పారితోషికం అందుకుంటున్నట్టుగా ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇక ఈ సినిమా కోసం బన్నీ అందుకుంటున్న పారితోషికం కూడా తక్కువేమీ కాదు .. ఆయన కూడా భారీమొత్తమే తీసుకుంటున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. కథాకథనాల పరంగా .. లుక్ పరంగా బన్నీ ఈ సినిమా కోసం ఎక్కువ కసరత్తు చేయవలసి వచ్చింది. పాన్ ఇండియా సినిమా కావడం వలన ఎక్కువ రోజులను కేటాయించవలసి వచ్చింది. అందువలన తాను ఇంతవరకూ తీసుకుంటూ వచ్చిన పారితోషికానికి రెట్టింపు పారితోషికమే ఆయన అందుకుంటున్నాడని అంటున్నారు. పైగా బన్నీ ఒక సినిమాకి ఓకే చెబితే అది పూర్తయ్యేంతవరకూ ఆయన మరో ప్రాజెక్టుపైకి వెళ్లడు గనుక, నిర్మాతలు కాదనే అవకాశం లేదు. చూస్తుంటే తెలుగు సినిమా ఖర్చు పరంగా .. వసూళ్ల పరంగానే కాదు, పారితోషికాల పరంగా కూడా రికార్డులు సృష్టించేలానే ఉంది.