పొగాకు బ్రాండ్ డీల్ కి నో చెప్పిన బ‌న్నీ

Update: 2022-04-16 04:30 GMT
ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు .. అభిమానుల శ్రేయ‌స్సు.. ఎల్ల‌పుడూ చాలా ముఖ్యం. త‌మ‌ను విప‌రీతంగా ప్రేమించే ఆరాధించి అనుక‌రించే వారిని త‌ప్పు దారి ప‌ట్టించే ప‌నులేవీ తార‌లు చేయ‌కూడ‌దు. పొగాకు కంపెనీలు.. ఆల్క‌హాల్ బ్రాండ్స్ .. కోలా బ్రాండ్స్ .. ర‌మ్మీలు.. ఆన్ లైన్ గేమ్స్ వంటి వాటికి స్టార్లు ప్ర‌చారం చేయ‌డం స‌రికాదు. కోట్ల‌లో పారితోషికాలు ఇచ్చి ప్ర‌ముఖ స్టార్ల‌తో ప్ర‌చారం చేయించుకోవ‌డం దాంతో భారీగా ఆర్జించ‌డం కార్పొరెట్ కంపెనీల హ్యాబిట్.

అయితే ఇలాంటి వాటికి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కానీ .. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కానీ వ్య‌తిరేకం అన్న సంగ‌తి తెలిసిందే. కోలా కంపెనీల‌తో భారీ డీల్స్ ని సైతం వీరు వ‌దులుకున్నారు గ‌తంలో. అదంతా ప్ర‌జ‌లు .. అభిమానుల మేలు కోరి తీసుకున్న నిర్ణ‌యం. డ‌బ్బు సంపాదించాలంటే చాలా మార్గాలున్నాయి. కేవ‌లం ఆ ఒక్క మార్గాన్నే ఎన్నుకోవ‌డం స‌రికాద‌ని వారు నిరూపించారు.

అయితే ఇప్పుడు అదే బాట‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ భారీ డీల్ ని వ‌దులుకున్నార‌ని తెలిసింది. పొగాకు ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన ప్ర‌ఖ్యాత బ్రాండ్ నుంచి ఈ ఆఫ‌ర్ బ‌న్నీకి వ‌చ్చింది. కానీ అత‌డు ఇది స‌రికాద‌ని వారించి తాను చేయలేన‌ని చెప్పార‌ట‌. పొగాకు ఉత్ప‌త్తులు ఖైనీలు .. జ‌ర్ధాల‌కు స్టార్లు ప్ర‌చారం చేస్తే ఇంకేమైనా ఉందా?  దానినే అభిమానులు అమాయ‌క ప్ర‌జ‌లు అనుస‌రించే ప్ర‌మాదం ఉంది.  త‌మ ఫేవ‌రెట్ ప్ర‌క‌ట‌న చూసి అత‌డిని అనుస‌రించి నాశ‌నం అయ్యేందుకు చాలా ఎక్కువ అవ‌కాశాలున్నాయి.

పొగాకు ఉత్ప‌త్తుల‌తో క్యాన్స‌ర్ త‌ప్ప‌నిస‌రి. ఈ మ‌హ‌మ్మారీ ఇప్ప‌టికే ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ఉంద‌న్న ఆధారాలు ఉన్నాయి. అందుకే  పొగాకు ఉత్ప‌త్తి ఎండోర్స్ మెంట్ కి అల్లు అర్జున్ అంగీక‌రించ‌లేదని తెలిసింది. ఈ త‌ర‌హా యాడ్స్ చేయ‌న‌ని మొహ‌మాటం లేకుండా చెప్పేశాడు. ఏది ఏమైనా.. ఇది మంచి నిర్ణ‌యం. స్వ‌లాభం కోసం ఇలాంటి వాటికి అంగీక‌రించ‌డాన్ని లోకం హ‌ర్షించ‌దు. మునుముందు ర‌మ్మీలు కోలాలు వంటి వాటికి తార‌ల‌ ప్ర‌చారాన్ని ఆపేయాల‌ని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. పుష్ప 2 త‌ర్వాతా బ‌న్నీ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో భార‌తీయ ఆడియెన్ ని అల‌రించాల‌ని ఆకాంక్షిస్తున్నారు. ఇండియా బెస్ట్ స్టార్ గా అత‌డు ఎద‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా ప్ర‌జ‌లు ధీవిస్తున్నారు.

వెకేష‌న్ ముగించి సెట్స్ పైకి పుష్ప‌రాజ్‌!

పుష్ప‌- ది రైజ్ సుదీర్ఘ షెడ్యూళ్ల షూటింగ్.. ప్ర‌మోష‌న్స్ తో ఎంతో అల‌సిపోయిన బ‌న్నీ యూర‌ప్ ట్రిప్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అత‌డు ఇంత‌కుముందే ట్రిప్ ముగించి హైద‌రాబాద్ లో దిగిపోయాడు. సుకుమార్ ఇప్ప‌టికే పార్ట్ 2 కి ముహూర్తం పెట్టుకుని రెడీగా ఉన్నా కానీ.. ఇటీవ‌ల‌ యూర‌ప్ అందాల న‌డుమ ఫ్యామిలీతో ఫుల్ రిలాక్స్ అయ్యి సిద్ధ‌మ‌య్యాడు బ‌న్ని. ఖ‌రీదైన‌ ప‌ర్య‌ట‌న‌ను ముగించి ఫ్రెష్ నెస్ తో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు.అలాగే విదేశాల్లో బ‌న్నీ తన భార్య స్నేహ ఇతర స్నేహితులతో కలిసి పార్టీలతో చిల్ అయ్యారు. ఈ ఫోటోల‌న్నిటినీ స్నేహా ఎంతో యాక్టివ్ గా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు.

బ‌న్నీ తన 40వ పుట్టినరోజును జరుపుకోవడానికి యూరప్ కి వెళ్లాడు. హ్యాపీ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. స్పెష‌ల్ డే కి సంబంధించి ఎమోష‌న‌ల్ నోట్ ని రాసాడు.

దీనికి  మెగాస్టార్ చిరంజీవి- డేవిడ్ వార్న‌ర్ సహా సమంత రూత్ ప్రభు- రష్మిక మందన్న- సుకుమార్ - హన్సిక మోత్వాని సహా పలువురు ప్రముఖులు బ‌న్నీకి అందమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంత‌లోనే అల్లు అర్జున్ - స్నేహ ట్రిప్ ముగించి తిరిగి వ‌స్తూ విమానాశ్రయంలో కనిపించారు. త్వరలో పుష్ప రెండవ భాగాన్ని బ‌న్నీ ప్రారంభించనున్నారు. పుష్ప: ది రూల్ అనే టైటిల్ తో ఈ ఏడాది జూలైలో సినిమా మొదటి షెడ్యూల్ ను ప్రారంభించాలని సుకుమార్ భావిస్తున్నారు.
Tags:    

Similar News