తెలుగు ఇండస్ర్టీలో బర్నింగ్ స్టార్ అన్న పేరు తెచ్చుకుని స్టార్లను సైతం షాక్ కు గురిచేస్తూ తన శైలి సినిమాలతో హిట్లు కొట్టిన సంపూర్ణేశ్ బాబు తెలుగు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. తాను ఇంతకుముందు తన గురించి చెప్పినవన్నీ అబద్ధాలని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఒక ఎన్నారైనని... విదేశాల్లో బాగా సంపాదించి, ఇక్కడకు వచ్చి సినిమాలు తీస్తున్నానంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పానని... అయితే, అదంతా అబద్ధమని తాను సాధారణ వ్యక్తినని ఆయన తెలిపారు.
తన అసలు పేరు నరసింహాచారి అని... సినిమాల్లోకి రాక ముందు సిద్ధిపేటలో ఓ బంగారం దుకాణంలో పని చేసేవాడినని చెప్పాడు. తాను ఇప్పటికీ సిద్ధిపేటలోనే ఉంటానని... సినిమా షూటింగ్ ఉన్నప్పుడే హైదరాబాదుకు వస్తుంటానని తెలిపాడు. ఊర్లో ఉంటే ఇప్పటికీ సైకిల్ పై తిరుగుతానని చెప్పాడు. పిల్లలను కూడా సైకిల్ మీదనే స్కూల్ కు తీసుకెళతానని తెలిపాడు.
సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ వచ్చానని చెప్పాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంపూ ఈ విషయాలను వెల్లడించాడు. అదండీ సంపూ హృదయ కాలేయంలోని మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/