RRR ఔట్ పుట్ పై రైట‌ర్ లీక్స్

Update: 2021-11-18 11:30 GMT
వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌ని చేస్తున్నారు బుర్రా సాయి మాధ‌వ్. ఆర్.ఆర్.ఆర్ త‌ర‌వాత ఆర్.సి 15కి ఆయ‌నే ర‌చ‌యిత‌. ప్ర‌జ‌లు మెచ్చిన ఉత్త‌మ డైలాగ్ ర‌చ‌యిత‌గా ఆయ‌న ప‌రిశ్ర‌మ‌లోనే టాప్ రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు.

ఇంత‌కుముందు ఆయ‌న రాజ‌మౌళితో పాన్ ఇండియా సంచ‌ల‌నం బాహుబ‌లి ఫ్రాంఛైజీకి ప‌ని చేయాల్సి ఉన్నా అప్ప‌ట్లో కొన్ని కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేదు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తో ఆ లోటు తీరింది.

రాజ‌మౌళి RRR కోసం డైలాగ్స్ రాసిన తర్వాత అత‌డు శంకర్ తోనూ తొలి తెలుగు చిత్రానికి ఆఫ‌ర్ ద‌క్కించుకున్నాడు. అన్న‌ట్టు ఆర్.ఆర్.ఆర్ స్వ‌రూపం ఎలా ఉండ‌నుంది? అని ప్ర‌శ్నిస్తే .. ఈ సినిమా విజయానికి హద్దులుండవని సాయిమాధవ్‌ బుర్రా అన్నారు. విజయంతో కొత్త చరిత్ర సృష్టిస్తుందని న‌మ్మ‌కం వ్య‌క్తం చేశారు.

అయితే క‌రోనా క్రైసిస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్టు ధ‌ర‌ల అంశం కూడా ఇప్పుడు రికార్డులు బ్రేక్ చేసేందుకు ప్ర‌తిబంధ‌కం అవుతుంది. ఇలాంటి సంద‌ర్భంలో వ‌స్తున్న ఆర్.ఆర్.ఆర్ ఎలాంటి వ‌సూళ్ల‌ను సాధిస్తుంది? అన్న‌ది ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

జ‌న‌వ‌రిలో ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ లో వేడి పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా పాట‌లు పోస్ట‌ర్ల‌తో క్రేజు పెరుగుతోంది. ట్రైల‌ర్ తో ఇది పీక్స్ కి చేరుతుంద‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News