ఐఫా-2022 ఈవెంట్‌ ని గ‌డ‌గ‌డ‌లాడించిన నోరా

Update: 2022-06-05 12:56 GMT
న‌టిగా డ్యాన్స‌ర్ గా నోరాకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. డ్యాన్స్ రియాలిటీ షోల జ‌డ్జిగా ఐట‌మ్ గాళ్ గా ఇప్ప‌టికే ఈ బ్యూటీ దూసుకుపోతోంది. షో స్టాప‌ర్ అన్న ప‌దానికి నోరా ఒక ప‌ర్యాయంగా నిలిచింది. ఈ సంవత్సరం IIFA అవార్డులలో నోరా మళ్లీ తానేంటో చూపించింది. నోరా ఫతేహి తన మెరిసే బ్లూ గౌనుతో గ్రీన్ కార్పెట్ మీద మిరుమిట్లు గొలిపే లుక్ లో క్యాట్ వాక్ చేసింది. నోరా నీలిరంగు గౌనులో స్వీట్ హార్ట్ నెక్ లైన్.. చిన్న స్ట్రిప్స్.. థై స్లిట్ లుక్ లో గుబులు రేపింది. నోరా ఆకర్షణీయమైన చోకర్ నెక్లెస్.. బ్రాస్ లెట్.. పూతపూసిన ఇయర్ స్టడ్ లతో యూనిక్ లుక్ లో క‌నిపించింది.

IIFA అవార్డ్స్ నైట్ లో నోరా తన మెరిసే వస్త్రధారణతో షోని దొంగిలించింది. అంతేకాదు నోరా స్టేజ్ అప్పియ‌రెన్స్ కోసం డ్యాన్సుల‌ను ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వీడియో ఇంత‌కుముందు వైర‌ల్ గా మారింది. ఐఫాలో మ‌రోసారి మ‌నోహ‌రి హ‌వా ఒక రేంజులో సాగింది.
Tags:    

Similar News