కింగ్ నాగార్జునతో బుట్టబొమ్మ పూజాహెగ్డే కలిసి పని చేసిందా? ఇద్దరు సైలెంట్ గా షూట్ పూర్తి చేసి సర్ ప్రైజ్ చేస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. మరి ఇద్దరు ఏ సినిమాలో జంటగా నటించినట్లు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఈ కాంబో చేతులు కలిపింది సినిమా కోసం కాదు. ఓ కమర్శియల్ యాడ్ కోసం అని తెలుస్తోంది. శనివారం ఇద్దరి మధ్య ఈ యాడ్ షూట్ జరిగింది.
దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవి చూసిన అభిమానులు ఇదేం సర్ ప్రైజ్ అంటూ సందేహిస్తున్నారు. ఇదొక ఫ్రూట్ జ్యూస్ డ్రింక్ బ్రాండ్ యాడ్. ఈ ప్రకటనలో నాగార్జున -పూజా హెగ్డే సాధారణ శైలికి భిన్నంగా కనిపించారు. యాడ్ ప్రసారం అయితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఇద్దరు బ్రాండ్స్ ని ఎండార్స్ చేయడంలో ఆరితేరిన వారే. నాగార్జున చాలా కాలంగా కమర్శియల్స్ చేస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన సినిమాల కన్నా ఎక్కువగా యాడ్స్ చేస్తున్నారు. వాటి ద్వారానే కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇక నటిగా పాపులర్ అయిన తర్వాత పూజాహెగ్డే కమర్శియల్స్ బాగానే చేస్తోంది.
వివిధ ప్రొడక్ట్ లకు ప్రచారకర్తగా వ్యవరించి రెండు చేతులా సంపాదిస్తుంది. అయితే అమ్మడికి ఈ ఏడాది నిరాశే ఎదురైంది. విడుదలైన స్టార్ హీరోల చిత్రాల్ని బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. బాలీవుడ్ లోనూ అదే పరిస్థితి. ఆ రకంగా టాలీవుడ్..కోలీవుడ్ తో పాటు నిరాశ తప్పలేదు. అమ్మడు నాగార్జున తనయులు నాగచైతన్య..అఖిల్ తోనూ రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే.
చైతన్యతో 'ఒక లైలా కోసంలో'....అఖిల్ తో 'బ్యాచిలర్' సినిమా చేసింది. తాజాగా కింగ్ తో యాడ్ లోనూ కలిసి నటించింది. ఆ రకగా అక్కినేని హీరోలందరితో అమ్మడు రొమాన్స్ చేసింది. నాగార్జునతో ఓ సినిమా కూడా చేసేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. ప్రస్తుతం నాగార్జున రైటర్ ప్రసన్న కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.