నాన్నకు ప్రేమతో.. ఈ ఏడాది ప్రారంభంలో టాలీవుడ్ బాక్సాఫీస్ ని కళకళలాండిచిన సినిమా. ఎన్నెన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ.. టఫ్ కాంపిటీషన్ మధ్య వచ్చినా సూపర్బ్ గా పెర్ఫామ్ చేసింది. 52 కోట్ల కలెక్షన్స్ రాబట్టేసి.. ఎన్టీఆర్ కి- సుకుమార్ కి మరిచిపోలేని విజయం అందించింది. వీళ్లిద్దరికీ కెరీర్ బిగ్గెస్ట్ మూవీ ఇదేనంటే.. నాన్నకు ప్రేమతో సాధించిన విజయం అర్ధమవుతుంది.
నాన్నకు ప్రేమతో లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తమ బ్యానర్ పై తీసినందుకు గానీ.. ఆ మూవీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తన కృతజ్ఞతను చాటుకున్నాడు. సుకుమార్ కి ఓ మరిచిపోలేని మధుర జ్ఞాపకం లాంటి గిఫ్ట్ ఇచ్చాడు. అదే బీఎండబ్ల్యూ ఎక్స్3 సిరీస్ కారు. దీని రేటు అక్షరాలా యాభై లక్షల రూపాయలు. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడమంటేనే.. ఎంతగా ఈ నిర్మాత ఖుషీ అయిపోయాడో అర్ధమవుతుంది. సినిమా సక్సెస్ అయిన 7 నెలల తర్వాత కూడా తన సంతోషాన్ని ఇంత కాస్ట్లీగా ప్రకటించాడీ ప్రొడ్యూసర్.
నాన్నకు ప్రేమతోకి కలెక్షన్స్ ద్వారా వచ్చిన మొత్తం కాకుండా.. యూరోప్ లో షూటింగ్ చేసిన ఖర్చుల్లో దాదాపు 6 కోట్లు నిర్మాతకు వెనక్కు వచ్చాయనే వార్తలు వచ్చాయి. బహుశా ఆ ఆనందాన్ని కూడా కలిపి ఇలా పంచుకుని ఉంటాడని అంటున్నారు సినీ జనాలు.