పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి, ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ కి విబేధాలు వచ్చాయనే టాక్ బాగా వినిపించింది. అత్తారింటింకి దారేది సినిమాకి సంబంధించి పవన్ కి చెల్లించాల్సిన రెమ్యూనరేషన్ విషయంలో గొడవలు వచ్చాయనే వార్తలొచ్చాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వరకూ వివాదం వెళ్లిందనే టాక్ వచ్చినా.. తర్వాత అదేం లేదని తేలిపోయింది.
అయితే పవన్ తో తనకు గొడవేమీ లేదని, అది చాలా చిన్న సమస్య అంటున్నాడు బీవీఎస్ఎన్ ప్రసాద్. త్వరలోనే పరిష్కారం అయిపోతుందని.. అన్నీ కుదిరితే తన తర్వాతి సినిమాని పవన్ తోనే చేయబోతున్నట్లు కూడా చెప్పాడాయన. పవర్ స్టార్ తో వివాదాన్ని ఇంత సింపుల్ గా తేల్చేయడం, తర్వాత సినిమాని కూడా చేస్తాననడంతో.. దాదాపుగా ఈ గొడవ సద్దుమణిగినట్లే అంటున్నారు టాలీవుడ్ జనాలు.
మరోవైపు నాన్నకు ప్రేమతో చిత్రానికి మొదట డివైడ్ టాక్ వచ్చిందని అంగీకరించాడు ఈ ప్రొడ్యూసర్. అయితే తానేం కంగారు పడలేదని, ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని అనుకున్నానని చెప్పాడు. తన నమ్మకం నిజమైందని, అద్భుతమైన వసూళ్లతో బ్లాక్ బస్టర్ సాధించడం హ్యాపీగా ఉందని చెప్పాడు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.